Inter Fee : తెలంగాణ ఇంటర్ ఎగ్జామ్స్ ఫీజు గడువు పెంపు
డిసెంబర్ 4-10, రూ.500తో డిసెంబర్ 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
- By Latha Suma Published Date - 04:03 PM, Tue - 26 November 24

Telangana Inter Board : తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు గడువును అధికారులు పొడిగించారు. వాస్తవానికి ఈరోజుతో ముగియనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్ బోర్డు పొడిగించింది. డిసెంబర్ 3 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా చెల్లించవచ్చని అధికారులు వెల్లడించారు. రూ.100 అదనపు ఫీజుతో డిసెంబర్ 4-10, రూ.500తో డిసెంబర్ 11-17, రూ.వెయ్యితో డిసెంబర్ 18-24, రూ.2వేలతో డిసెంబర్ 25 నుంచి జనవరి 2 వరకు చెల్లించవచ్చని తెలిపారు.
డిసెంబర్ 15, 16న జరిగే గ్రూప్-2 ఎగ్జామ్స్‌లో ఎలాంటి మార్పు లేదని టీజీపీఎస్సీ అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్ 16న జరిగే ఆర్‌ఆర్‌బీ పరీక్షను రాష్ట్రం నుంచి డిప్లొమా, ఐటీఐ అర్హత ఉన్న 6,300 మంది రాస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దీంతో గ్రూప్-2 పరీక్షకు ఎలాంటి ఆటంకం ఉండబోదని వివరించారు.
పరీక్ష ఫీజు వివరాలు..
. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(జనరల్): రూ.520
. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు(ఒకేషనల్, ప్రాక్టికల్స్): రూ.750.
. ఇంటర్ సెకండియర్ జనరల్ (ఆర్ట్స్) విద్యార్థులు రూ.520.
. ఇంటర్ సెకండియర్ జనరల్ (సైన్స్) విద్యార్థులు రూ.750.
.ఇంటర్ సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులు రూ.750.
పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలు..
. ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 03.12.2024
. రూ.100 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: 04.12.2024 నుంచి 10.12.2024 వరకు
. రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 11.12.2024 నుంచి 17.12.2024 వరకు
. రూ.1000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 18.12.2024 నుంచి 24.12.2024 వరకు
. రూ.2000 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి తేదీ: 25.12.2024 నుంచి 02.01.2025 వరకు