Telangana Spice Kitchen Restaurant : తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్‌లో భారీ పేలుడు
Explosion : పేలుడు ధాటికి హోటల్ చుట్టూ నిర్మించిన ప్రహరి గోడలోని సిమెంట్ ఇటుకలు, రాళ్లు గాల్లో ఎగిరివెళ్లి 20 మీటర్ల అవతల ఉన్న గుడిసెలపై పడ్డాయి
- By Sudheer Published Date - 01:11 PM, Sun - 10 November 24

జూబ్లీ హిల్స్‌లోని తెలంగాణ స్పైస్ కిచెన్ హోటల్ (Telangana Spice Kitchen Restaurant)లో ఆదివారం ఉదయం ఒక భారీ పేలుడు (Explosion ) చోటుచేసుకుంది, దీని కారణంగా పరిసర ప్రాంతంలో భారీ నష్టాన్ని కలిగించింది. హోటల్‌లోని ఫ్రిజ్ కంప్రెస్‌రే పేలుడు కారణంగా ఈ సంఘటన జరిగింది. ఈ పేలుడు ధాటికి హోటల్ చుట్టూ నిర్మించిన ప్రహరి గోడలోని సిమెంట్ ఇటుకలు, రాళ్లు గాల్లో ఎగిరివెళ్లి 20 మీటర్ల అవతల ఉన్న గుడిసెలపై పడ్డాయి. పేలుడు వల్ల రాళ్లు ఎగిరిపడటంతో ఒకరిద్దరికి గాయాలైనట్లు తెలుస్తోంది. నాలుగైదు గుడిసెలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పేలుడు తీవ్రతకు తాము అదిరిపోయామని దుర్గా భవానీ నగర్ బస్తీ వాసులు చెబుతున్నారు.
పేలుడు జరిగిన సమయంలో తామంతా గాఢ నిద్రలో ఉన్నామని బస్తీ వాసులు తెలిపారు. హోటల్లో ఏం జరిగిందో అర్థం కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లు పరుగులు తీశారు. హోటల్లో పేలుడు ఘటనపై సమాచారం అందుకున్న డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు హుటాహుటిన హోటల్‌కు చేరుకున్నారు. హోటల్ సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకున్నారు.
Read Also : Kasthuri Shankar : పరారీలో నటి కస్తూరి.. ఫోన్ స్విచ్చాఫ్.. ఇంటికి తాళం