HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ex Dsp Nalini Emotional Post

EX DSP Nalini Emotional Post : కన్నీరు పెట్టిస్తున్న డీఎస్పీ నళిని కథ..

  • Author : Sudheer Date : 17-12-2023 - 11:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ex Dsp Nalini Emotional Pos
Ex Dsp Nalini Emotional Pos

తెలంగాణ రాష్ట సాధన కోసం డిఎస్పీ ఉద్యోగానికి సైతం రాజీనామా చేసి..చరిత్ర పుటల్లోకి ఎక్కారు నళిని (EX DSP Nalini). ప్రత్యేక తెలంగాణ సాధన కోసం వివిధ వర్గాల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలిపిన నళిని (EX DSP Nalini) స్వగ్రామం వరంగల్‌ జిల్లా. ఆత్మకూరు మండలం ఉల్లిగడ్డ దామెరకు చెందిన నరేందర్‌తో ఈమెకు వివాహం జరిగింది. నరేందర్‌ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఎంకాం, బీఈడీ, పీజీడీసీఏ, డిప్లొమా ఇన్‌ ఫార్మసీ పూర్తి చేసిన నళిని 2006లో పరకాలలో హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు. అనంతరం 2007 గ్రూప్‌-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. నళిని డీఎస్పీగా హన్మకొండ, హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్లలో మూడు వారాలపాటు ప్రొబేషనరీ విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఆమెను కరీంనగర్‌ డీఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం కొద్ది రోజులకే నళిని మెదక్‌ డీఎస్పీగా బదిలీ అయ్యారు.

డీఎస్పీగా (DSP) కొనసాగుతున్న ఆమె తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ, పోలీసు శాఖలో ఆంధ్ర అధికారుల నిరంకుశ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించారు. ఆ తర్వాత డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళినికి పోలీస్ శాఖలో అదే ఉద్యోగాన్ని ఇవ్వాలని రేవంత్ నిర్ణయించారు. నళినికి ఉద్యోగం చేయాలనే ఆసక్తి ఉంటే వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించారు. పోలీస్‌ శాఖలో మార్గదర్శకాలకు సంబంధించి అవరోధాలు ఏమైనా ఉంటే.. అదే హోదాలో ఇతర శాఖలో ఉద్యోగాన్ని ఇవ్వాలని సూచించారు.

తనకు మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రతిపాదనను మాజీ డీఎస్పీ నళిని సున్నితంగా తిరస్కరించారు. రేవంత్ చూపించిన ఆత్మీయత నతకు గొప్ప స్వాంతన కలిగించాయని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వం తనను మూడేళ్లు ఇబ్బంది పెట్టిందని గుర్తు చేసుకున్నారు. మాజీ సీఎం రోశయ్య మహిళా దినోత్సవం నాడు తనకు తన ఉద్యోగాన్ని కానుకగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

దీంతో..నళిని తన రాజీనామా ఉప సంహరించుకొని తిరిగి ఉద్యోగంలో చేరారు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని నళిని చెప్పుకొచ్చింది. 18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చి,నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్స్ రాయమనడం ,అనువల్ confidencial reports లో అడ్వర్స్( చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్ లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి CM కిరణ్ కుమార్ రెడ్డి గారికి మొర పెట్టుకొనేలా చేశాయి. ఉమ్మడి రాష్ట్రం లో నాకు వారి అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదు. బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయక పోగా, నన్ను ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి, సోనియా గాంధీజీకి లేఖలు రాసి నా పరిస్థితి ని, రాష్ట్ర దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీ కి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళను. శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నా లోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆరోజే హత్య చేశారు.

ఇప్పుడు 12 ఏళ్ల తరువాత సీఎం రేవంత్ స్పందించిన తీరు పైన నళిని ఉద్వేగానికి లోనయ్యారు. తాను ఎవరి కోసం ఇక ఎటువంటి త్యాగాలు చేయలేనని స్పష్టం చేసారు. వేద ప్రచారకురాలిగా సనాతన ధరమాన్ని ప్రచారం చేయటమే తన ముందున్న కర్తవ్యంగా నళిని స్పష్టం చేసారు. పోలీసు కాకుండా వేరే ఉద్యోగం తాను చేయలేననని వివరించారు. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను.జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు.ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను .జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను.వేద ప్రచారకురాలిగా,వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతి తో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చు.కాబట్టి నా పంథా మర్చుకొలేను అని తన గుండెల్లో ఉన్న బాధను బయటకు చెప్పుకుంది.

Read Also : Balineni Srinivasa Reddy : జనసేన లోకి బాలినేని..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • EX DSP Nalini
  • EX DSP Nalini Emotional Post
  • telangana

Related News

Massive arrangements for the Farmers' Blessing Meeting

Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు

జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd