Etela Rajender : హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
పోచారం పీఎస్‌లో ఈటెల రాజేందర్‌పై బాధితుడి ఫిర్యాదు మేరకు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈటల రాజేందర్ పిటిషన్ దాఖ్యలు చేశారు.
- Author : Latha Suma
Date : 27-01-2025 - 2:18 IST
Published By : Hashtagu Telugu Desk
Etela Rajender : పోచారం పీఎస్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ..బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏకశిలనగర్‌లో స్థిరాస్తి వ్యాపారిపై చేసుచేసుకున్నారని ఈటలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదుపై చర్యలు తీసుకున్నారు. దీంతో ఈటల హైకోర్టును ఆశ్రయించారు.
ఇటీవల మేడ్చల్ జిల్లాలోని నిరుపేదల భూములను ఓ ల్యాండ్ బ్రోకర్ కబ్జా చేయడమే కాకుండా అందులో వెంచర్ వేశాడు. దీంతో బాధితులు ఎంపీకి విన్నవించుకోగా.. ఆయన అప్పటికే ఫోన్ ద్వారా ల్యాండ్ బ్రోకర్‌ను హెచ్చరించినా వినిపించుకోలేదు. ఈక్రమంలోనే ఎంపీ ఈటల తన అనుచరులతో కలిసి స్పాట్‌కు వెళ్లి.. బ్రోకర్ మీద చేయి చేసుకున్నాడు. ఆయన అనుచరులు సైతం అతనిపై దాడి చేశారు. దీంతో పోచారం పీఎస్‌లో ఈటెల రాజేందర్‌పై బాధితుడి ఫిర్యాదు మేరకు పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఈటల రాజేందర్ పిటిషన్ దాఖ్యలు చేశారు.
కాగా, గత మంగళవారం మున్సిపాలిటీలో ఈటల పర్యటించారు. పేదలు కొనుక్కున్న జాగాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారు. భూములు కొనుక్కున్న పేదల సమస్యలపై కలెక్టర్, సీపీతో మాట్లాడాను. కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని ఈటల ఆరోపించారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈటల డిమాండ్ చేశారు. దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారు. కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ప్రభుత్వంపై ఈటల ధ్వజమెత్తారు.
Read Also: On One Nation One Time: “వన్ నేషన్ – వన్ టైమ్” కు కేద్రం ప్రతిపాదన