Etela House Arrest : ఈటెల రాజేందర్ హౌస్ అరెస్ట్
Etela : ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి
- By Sudheer Published Date - 11:48 AM, Sat - 19 October 24

బిజెపి ఎంపీ ఈటెల రాజేందర్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ (Etela House Arrest) చేసారు. వారం రోజుల క్రితం సికింద్రాబాద్ (Secunderabad ) కుమ్మరిగూడ (Kurmaguda ) ముత్యాలమ్మ ఆలయం(Muthyalamma Temple)లోని అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం వారి తీరు మార్చుకోవడం లేదు. రాత్రి వేళల్లో దేవాలయాల్లోకి చొరబడి..విగ్రహాలను ధ్వసం చేస్తున్నారు. ఇక ఇప్పుడు కుమ్మరిగూడ లోను అలాగే జరిగింది. వరం రోజుల క్రితం అర్థరాత్రి దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి విగ్రహాన్ని ధ్వసం చేసారు. స్థానికులు ఓ నిందితుడిని పట్టుకొని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు , రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ ఘటన కు వ్యతిరేకంగా ఈరోజు సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.
ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న బిజెపి ఎంపీ ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. విగ్రహం ధ్వసం జరిగిన రోజున ఎంపీ ఈటెల రాజేందర్ (Etela Rajender) సైతం ఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగితెలుసుకున్నారు. ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముత్యాలమ్మ గుడిపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యక్తులు, శక్తులపట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని, లేదంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈటల తెలిపారు.
Read Also : CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పిటా వేసిన చంద్రబాబు..