Electricity Bills : ఫోన్ పేలో కరెంటు బిల్లులు కట్టేయండి.. త్వరలోనే అమెజాన్ పే, గూగుల్ పేలోనూ సేవలు!
అయితే ఆయా యాప్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో అనుసంధానం కాకపోవడంతో.. వాటి నుంచి అన్ని రకాల బిల్ పేమెంట్స్‌ను ఆపేశారు.
- By Pasha Published Date - 11:47 AM, Sat - 17 August 24

Electricity Bills : కరెంటు బిల్లులను మనం ఇంతకుముందు యూపీఐ యాప్‌ల నుంచి పే చేసేవాళ్లం. అయితే ఆయా యాప్‌లు భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో అనుసంధానం కాకపోవడంతో.. వాటి నుంచి అన్ని రకాల బిల్ పేమెంట్స్‌ను ఆపేశారు. అందువల్లే గత కొన్ని నెలలుగా మనం యూపీఐ యాప్స్ నుంచి కరెంటు బిల్లులను, ఇతరత్రా యుటిలిటీ బిల్లులను పే చేయలేకపోతున్నాం. త్వరలోనే ఆ సమస్యలు తీరబోతున్నాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
అన్ని యూపీఐ యాప్స్ తమను తాము భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)తో అనుసంధానం చేసుకోవాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో జులై 1 నుంచి ఆయా యూపీఐ సంస్థలు వాటి ప్లాట్‌ఫామ్‌ల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను ఆపేశాయి. దీంతో ప్రజలు విద్యుత్ బిల్లులను(Electricity Bills) ఆయా విద్యుత్ సంస్థల అధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల నుంచి చెల్లిస్తున్నారు. ఈ తరుణంలో ఊరటనిచ్చే ఒక వార్త బయటికి వచ్చింది. అదేమిటంటే.. ఫోన్ పేలో కరెంటు బిల్లుల పేమెంట్ సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి. మన తెలుగు రాష్ట్రాలలోని దాదాపు చాలావరకు విద్యుత్ పంపిణీ సంస్థల కరెంటు బిల్లుల చెల్లింపులను ఫోన్ పే ప్రాసెస్ చేస్తోంది. ఎందుకంటే బీబీపీఎస్‌తో ఫోన్ పే అనుసంధానం ప్రక్రియ పూర్తయిపోయింది. దీనిబాటలోనే గూగుల్ పే, అమెజాన్ పే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అవి కూడా తమ కస్టమర్లకు విద్యుత్ బిల్లులు చెల్లించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.అంటే ఇక మనం ఎలాంటి టెన్షన్ లేకుండానే యూపీఐ యాప్స్ నుంచి ఈజీగా కరెంటు బిల్లులు, డీటీహెచ్ వంటి ఇతరత్రా యుటిలిటీ బిల్లులను కట్టేయొచ్చన్న మాట.
Also Read :Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసే సంస్థ. ఎన్‌పీసీఐ ఆధ్వర్యంలోనే భారత్ బిల్ పేమెంట్ సిస్టం నడుస్తుంటుంది. ప్రస్తుతం బీబీపీఎస్ సంస్థ సీఈవోగా నూపూర్ చతుర్వేది ఉన్నారు. తాము గూగుల్ పే, అమెజాన్ పేతో కూడా చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే అవి కూడా బీబీపీఎస్ ప్లాట్‌ఫామ్‌లో చేరుతాయని ఆయన వెల్లడించారు.