HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dr Raghu Ram Pillarisetti Hyderabad Surgeon Gets Asa Fellowship

Dr Raghu Ram: డాక్టర్ రఘురామ్‌కు అమెరికన్ ఫెల్లోషిప్.. దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్న క్యాన్సర్ సర్జన్!

వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్‌ వైద్యులు, కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్ రఘు రామ్.

  • Author : Balu J Date : 06-04-2024 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dr Rahgu Ram
Dr Rahgu Ram

Dr Raghu Ram: వైద్యో నారాయణో హరీ.. ఈ మాటలను నిజం చేసి చూపిస్తున్నారు రొమ్ము క్యాన్సర్‌ వైద్యులు, కిమ్స్‌-ఉషాలక్ష్మి సెంటర్‌ ఫర్‌ బ్రెస్ట్‌ డిసీసెస్‌ డైరెక్టర్‌ డాక్టర్ రఘు రామ్. ఎన్నో ఏళ్లుగా ఈ రంగంలో పనిచేస్తూ క్యాన్సర్ రోగులకు ఉత్తమ సేవలందిస్తున్నారు. ఫలితంగా ఆయనకు అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ (ఎఎస్ఎ) గౌరవ ఫెల్లోషిప్ వరించింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. అంతేకాదు.. 144 సంవత్సరాల చరిత్రలో దక్షిణాసియా అత్యున్నత పురస్కారం అందుకున్న మూడో సర్జన్ రఘురామ్ కావడం విశేషం.  అమెరికా నలుమూలల నుంచి వచ్చిన విదేశీ ప్రతినిధుల మధ్య డాక్టర్ రఘు రామ్ ప్రశంసా పత్రాన్ని అందుకొని తెలుగు ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా ఏఎస్ఏ అధ్యక్షుడు ప్రొఫెసర్ స్టీవెన్ స్టెయిన్ రఘు రామ్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘డాక్టర్ రఘు రామ్ ఇండియాలో రొమ్ము క్యాన్సర్ సంరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ఇతర డాక్టర్ల కంటే ముందున్నారు. దేశంలో రొమ్ము క్యాన్సర్ థెరపీకి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి. ఇక సర్జికల్ లీడర్షిప్ పునర్నిర్మాణానికి ఆయన ఎంతగానో పడి ఇండియాలో శస్త్రచికిత్సకు రోల్ మోడల్ గా నిలిరాచు. రఘు రామ్ నిజంగా అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ గౌరవ ఫెలోషిప్ కు అర్హుడు ” అని ప్రశంసించారు.

ఈ సందర్భంగా డాక్టర్ రఘు రామ్ పిల్లిశెట్టి మాట్లాడుతూ.. అమెరికా అత్యున్నత సంస్థ నుంచి ఈ ఉన్నత గౌరవాన్ని అందుకోవడం మరిచిపోలేనిది. నా కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే ఈ స్థాయికి చేరుకునేవాడ్ని కాదేమోనని అన్నారాయన. వైద్యరంగంలో అలుపెరగని కృషి చేశా. నా జర్నీలో తోడుగా నిలిచిన నా సహోద్యోగులను మరిచిపోలేననని అన్నారు.  1880 లో అమెరికాలో అమెరికన్ సర్జికల్ అసోసియేషన్ సంస్థ (ఎఎస్ఎ) ఏర్పాటైంది. వివిధ దేశాల్లోని ప్రముఖ వైద్య రంగాలకు చెందిన వ్యక్తులు సభ్యులుగా ఉన్నారు. వీరిలో చాలా మంది ఈ సంస్థలలో శస్త్రచికిత్స విభాగాలకు చైర్మన్లుగా కొనసాగుతున్నారు. కాగా డాక్టర్ రఘు రామ్ కూడా కీలకంగా వ్యవహరించడంతో ఆయనకు ఫెల్లోషిప్ వచ్చింది.

Also Read: AP Trains Halting : స్పెషల్ ట్రైన్లు రయ్ రయ్.. ఏపీలో హాల్టింగ్స్ ఇవే


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cancer Doctor
  • Dr. Raghu Ram
  • Fellowship
  • hyderabad

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

    • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

    • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

    • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

    • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd