Ushalakshmi: బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చిందా.. అయితే నో వర్రీ!
మనుషుల జీవనశైలి మారుతోంది.. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో వ్యాధులతో పోరాడాల్సివస్తోంది. చిన్నచితక వ్యాధులు సోకితే ‘ఏంకాదులే’ అని సర్దుకుపోవచ్చు. కానీ క్యాన్సర్ అలాంటి వ్యాధుల బారిన పడితే
- By Balu J Published Date - 05:05 PM, Sat - 1 January 22

మనుషుల జీవనశైలి మారుతోంది.. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ఎన్నో వ్యాధులతో పోరాడాల్సివస్తోంది. చిన్నచితక వ్యాధులు సోకితే ‘ఏంకాదులే’ అని సర్దుకుపోవచ్చు. కానీ క్యాన్సర్ అలాంటి వ్యాధుల బారిన పడితే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందే. సామాన్యుల నుంచి సెలబ్రిటీ దాకా కాన్సర్ పట్టిపీడిస్తోంది. అందులో రొమ్ము క్యాన్సర్ కూడా. అవగాహన లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి సమయంలో ‘‘మేమున్నాం’’ అంటూ ముందుకొచ్చింది ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్.
విస్తృతంగా పరిశోధనలు
మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ సమస్యపై డాక్టర్ రఘు రామ్ విస్తృతంగా పరిశోధనలు చేశారు. డాక్టర్ రఘు రామ్ గత దశాబ్ద కాలంగా బ్రెస్ట్ క్యాన్సర్ కోసం భారతదేశంలో పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ బ్రెస్ట్ క్యానర్స్ ట్రీట్ మెంట్ అందించే ఆస్పత్రిగా భారతదేశంలోనే మంచిపేరుంది. రఘురాము సేవలకు గానూ అత్యున్నత పురస్కారం దక్కింది. రఘురామ్ కి UK ఆధారిత వైద్య సంస్థలతో పరిచయం ఏర్పడింది. ప్రతి సంవత్సరం క్వీన్ ఎలిజబెత్ II ప్రజా సేవలో రాణిస్తున్న వారిని సత్కరిస్తుంది. ఇందులో ఓ భారతీయ వైద్యుడు పాల్గొనడం దేశానికే గర్వకారణమన్నారు. డాక్టర్ రఘు రామ్ క్వీన్ ఎలిజబెత్ II ధన్యవాదాలు తెలిపారు. బ్రిటీష్ రాణి తరపున డాక్టర్ రఘు రామ్ (54)కు అత్యుత్తమ గౌరవాన్ని అందజేయనున్నారు. గత 100 ఏళ్లలో ఇటువంటి గౌరవాలు అందుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయుడు డాక్టర్ రఘు రామ్.
మాస్క్ క్యాంపెయిన్
గ్రామీణ భారతదేశంలో కొనసాగుతున్న కోవిడ్ మహమ్మారిని పరిష్కరించడానికి, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ (యుబిసిఎఫ్), కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ ‘కోవిడ్-19 పింక్ రిబ్బన్ మాస్క్ క్యాంపెయిన్ ఇన్ బంగారు తెలంగాణ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్-19 నుండి రక్షణను ప్రోత్సహిస్తుంది మరియు రొమ్ము క్యాన్సర్ అవగాహనను సూచించే రంగు ‘పింక్’ రంగు క్లాత్ మాస్క్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించడంపై అవగాహన కల్పిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో
నారాయణరావుపేట మండలంలోని నారాయణరావుపేట, ఇబ్రహీంపూర్, బంజర్‌పల్లి, కోదండరావుపల్లి, లక్ష్మీదేవిపల్లి, మల్యాల, గుర్రాలగొంది, జక్కాపూర్, గోపులాపూర్, మాటిండ్లతో పాటు పది గ్రామాల్లో ఇప్పటికే సుమారు 20 వేల మాస్క్‌లు పంపిణీ చేసినట్లు యూబీసీఎఫ్ డైరెక్టర్ డాక్టర్ రఘు రామ్ తెలిపారు.