Dost Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
ఇక, విద్యార్థులు ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
- By Latha Suma Published Date - 02:30 PM, Fri - 2 May 25

Dost Notification : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు ఉన్నత విద్యామండలి ‘దోస్త్’ 2025-26 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మూడు విడతల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇక, విద్యార్థులు ‘దోస్త్’ వెబ్‌సైట్, మొబైల్ యాప్, మీసేవ యాప్, మీసేవ కేంద్రాలకు వెళ్లి కళాశాల్లో ప్రవేశాలకు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
Read Also: PM Modi : ఈ ఫొటో చూసి కొందరికి నిద్ర పట్టదు: ప్రధాని మోడీ
ఈ నేపథ్యంలో రాష్టంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మా గాంధీ, శాతవాహన, JNTUH, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీల్లో బీఏ , బీకాం , బీఎస్సీ , బీబీఏ , తదితర సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం కానుంది. ఈ సందర్భంగా చైర్మన్ బాల కృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. ఈసారి మూడు విడతల్లో అడ్మిషన్లు జరుగుతాయని తెలిపారు. మొదటి దశ అడ్మిషన్ల కోసం ఈ నెల 3వ తేదీ నుండి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని వెల్లడించారు.
మొదటి ఫేజ్: మే 3 నుంచి 21 వరకు మొదటి ఫేజ్ దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు.
రెండో ఫేజ్: మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 13న సీట్ల కేటాయింపు.
మూడో ఫేజ్: జూన్ 13 నుంచి 19 వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం.
Read Also: Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడరేవు.. దీని ప్రత్యేకత ఇదే!