HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dont Worry Lets Be Alert Harish Raos Review On Corona

Harish Rao: ఆందోళన వద్దు, అప్రమత్తంగా ఉందాం: కరోనాపై హరీష్ రావు సమీక్ష

మంత్రి హరీశ్ రావు వైద్యాధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

  • Author : Balu J Date : 17-03-2023 - 4:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao
Harish Rao

నూతన వేరియంట్లతో పలు దేశాలు, రాష్ట్రాల్లో కరోనా (Corona) కేసులు పెరుగుదల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) వైద్యాధికారులతో శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి అన్ని విభాగాల వైద్యాధికారులతో చర్చించి, పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.

దగ్గు, జ్వరం, గొంతు నొప్పి వంటి కొవిడ్ లక్షణాలు ఉన్న వారు సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, అవసరమైన వారు చికిత్స పొందాలని సూచించారు. కొవిడ్ వ్యాక్సినేషన్లో తెలంగాణ దేశానికి ఆదర్శవంతంగా నిలిచిందని, ముఖ్యంగా ప్రికాషన్ డోసు పంపిణీ చేయడంలో మొదటి స్థానంలో ఉందని (Harish Rao) గుర్తు చేశారు. ఇప్పటి వరకు 7.75 కోట్ల వ్యాక్సిన్లను అర్హులైన వారికి అందించడం జరిగిందన్నారు. 1.35 కోట్ల ప్రికాషన్ డోసులు పంపిణీ చేయగా, 1.62 కోట్ల ప్రికాషన్ డోసు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. కొవిడ్ నుంచి తమను తాము రక్షించుకోవడంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పిహెచ్సీలు, యూపీహెచ్సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అవసరానికి సరిపడా కేంద్రం డోసులు సరఫరా చేయని నేపథ్యంలో, పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరిన్ని డోసులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయాలని అధికారులను (Harish Rao) ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్ పరీక్షలు చేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉందని, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అర్హులైన వారు తమ వంతుగా వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూమ్ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఇ రమేష్ రెడ్డి, డీహెచ్ శ్రీనివాస రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు.

Also Read: TSPSC Group 1: బ్రేకింగ్.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ రద్దు.. ఏఈఈ, డీఏవో పరీక్షలు కూడా!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • corona
  • corono virus
  • harish rao
  • telangana

Related News

Uttam Krishna Water

కృష్ణా జలాల వివాదం, కేసీఆర్ ఆరోపణలపై మంత్రి ఉత్తమ్ ఘాటు కౌంటర్

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. “అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్.

  • Uttam Kumar Reddy

    బీఆర్‌ఎస్‌ పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విసుర్లు..పాలమూరు’పై ఖర్చు చేసిన రూ. 7 వేల కోట్లకు లెక్క చెబుతా!

  • Telangana New Sarpanches

    సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్

  • Schools Closed Telangana

    తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!

  • Harish Rao

    చీకటి జీవోల మాటున ఏం చేస్తున్నావ్ రేవంత్ – హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు

Latest News

  • పచ్చి ఉల్లిపాయలను భోజనంతో తీసుకోవడం వల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు తెలుసుకుందామా?

  • అమరావతిలో మరో కీలక అధ్యాయం.. హైకోర్టు శాశ్వత భవన పనులకు శ్రీకారం

  • 2025లో అత్యధికంగా అమ్ముడైన కారు ఏదో తెలుసా?

  • బంగ్లాదేశ్‌ కోసం.. మీ అందరి కోసం నా దగ్గర ఓ ప్రణాళిక ఉంది: తారిక్ రహమాన్

  • గుడ్లు క్యాన్సర్​కు కారణమవుతాయా? ..FSSAI చేసిన సంచలన ప్రకటన ఏంటి?

Trending News

    • ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

    • సచిన్ వరల్డ్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. మరో 3 సెంచరీలు చేస్తే చరిత్రే!

    • 2025లో బంగారం, వెండి ధరల జోరు.. కొత్త సంవ‌త్స‌రంలో ఎలా ఉండ‌బోతుంది?!

    • శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్‌డేట్.. త్వరలోనే జ‌ట్టులోకి పునరాగమనం?

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd