HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Do The Youth Listen To Harish Rao

Harish Rao : హరీష్ రావు మాట యూత్ వింటారా..?

Harish Rao : దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ - బలాయ్ తీసుకుని కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని యువతకు హరీష్ రావు పిలుపు నిచ్చారు

  • Author : Sudheer Date : 07-10-2024 - 9:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishraocng
Harishraocng

కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) పై హరీష్ రావు (Harish Rao) దూకుడు పెంచారు. సై అంటే సై అంటున్నారు. ఇప్పటికే హైడ్రా (Hydraa) , రుణమాఫీ (Runamafi) పై పెద్ద ఎత్తున వార్ కొనసాగించిన హరీష్..ఇప్పుడు కాంగ్రెస్ హామీలపై చర్చ మొదలుపెట్టాలని యూత్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ లో దసరా (Dasara) పండగను ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలియంది కాదు..దేశంలోనే కాదు వరల్డ్ లో ఎక్కడ ఉన్న సరే తెలంగాణ ప్రజలు తమ సొంతర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరాకు ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ – బలాయ్ తీసుకుని కాంగ్రెస్ చేసిన మోసాలపై చర్చించాలని యువతకు హరీష్ రావు పిలుపు నిచ్చారు.

గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధు ఊసే లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కొత్త ప్రాజెక్ట్ లు లేవు, ఇలా ఏమి అమలు జరగడం లేదని ..కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తించాలని సూచించారు. అందుకే ఈ పండుగ సమయంలో ఊళ్లకు వస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులతో అలాయ్ ‌- బలాయ్ తీసుకుంటూ కాంగ్రెస్ చేసిన మోసాల గురించి చర్చించాలని పిలుపునిచ్చారు. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌లపై ఎక్కడిక్కడ నేతలను నిలదీయాలని ‘కాంగ్రెస్ ఫెయిల్ తెలంగాణ’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరి హరీష్ రావు పిలుపు మేరకు యూత్ కాంగ్రెస్ పై సోషల్ వార్ చేస్తారా..? లేదా అనేది చూడాలి.

గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నమ్మి తమ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయాలని గ్రామాల్లో ప్రచారం చేసిన యువత ఒక్కసారి ఆలోచించాలి.

గ్యారెంటీలు అమలు చేయలేకపోగా, మీ ఊళ్లలో అవ్వాతాతలకు పెంచుతామన్న పింఛన్ పెంచలేదు, రుణమాఫీ పూర్తి చేయలేదు, రైతు బంధును…

— Harish Rao Thanneeru (@BRSHarish) October 6, 2024

Read Also : Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • congress guarantee schemes
  • dasara
  • harish rao

Related News

Bhatti Vikramarka (1)

Bhatti Vikramarka: బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఫైర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ నాయకులపై, ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటే… హరీష్ రావు మాత్రం అబద్ధాలు ప్రచారం చేయడంలో బిజ

  • Janasena Pawan Kalyan

    JANASENA : ప‌వ‌న్ పై జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఫైర్‌.. ప్యాకేజీ ఇస్తే..?

  • DK SHIVA KUMAR

    CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Latest News

  • Blender’s Pride : కోల్‌కతాలో బ్లెండర్స్ ప్రైడ్ రిజర్వ్ డ్ ఎక్స్ పీరియెన్సెస్’ సాంస్కృతిక ప్లాట్‌ఫామ్‌ ప్రారంభం

  • AI CRM : భవిష్యత్ శ్రామిక శక్తి వైపు భారత్.. 10 లక్షల మంది యువతకు సేల్స్‌ఫోర్స్ ఏఐ శిక్షణా సంకల్పం

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd