HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Displaced Medical Students To Be Accommodated In Ts Colleges

Medical Students: ఆ మెడికల్ విద్యార్థులకు సీట్ల సర్దుబాటు బాధ్యత తెలంగాణ సర్కారుదే : ఎన్ఎంసీ

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తగిన వసతులు లేని తెలంగాణలోని మూడు ప్రైవేటు వైద్య కళాశాలల అనుమతులు ఇటీవల రద్దయ్యాయి.

  • Author : Hashtag U Date : 26-06-2022 - 5:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Doctors
Doctors

నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తగిన వసతులు లేని తెలంగాణలోని మూడు ప్రైవేటు వైద్య కళాశాలల అనుమతులు ఇటీవల రద్దయ్యాయి. ఈనేపథ్యంలో వాటిలో చేరిన విద్యార్థుల బాధ్యతను తెలంగాణ ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేర్కొంది.

విద్యార్థుల మెరిట్, ఇతర మెడికల్ కాలేజీల్లో ఖాళీల ఆధారంగా ఆ విద్యార్థులకు సీట్లను సర్దుబాటు చేయాలని తెలిపింది. ఒకవేళ కాలేజీల్లో సీట్లు ఖాళీగా లేకపోతే.. ఈ ఒక్కసారికి సీట్లను పెంచేందుకు సంబంధించిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని వెల్లడించింది.

అయితే అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో సీట్ల సంఖ్య 250కి మించకూడదని తేల్చి చెప్పింది. పీజీ మెడికల్ సీట్లను కూడా సర్దుబాటు చేయాలని ఎన్ఎంసీ తెలిపింది. సీట్ల రద్దు సమయంలోనే.. విద్యార్థులు ఎంత ఫీజు చెల్లించాలనే వివరాలతో కూడిన మార్గదర్శకాలను రాష్ట్రానికి పంపామని పేర్కొంది. తమ అడ్మిషన్లను రద్దు చేసి సీట్ల సర్దుబాటుకు మార్గదర్శకాలను జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఓ ప్రైవేటు వైద్య కళాశాల కు చెందిన 48 మంది విద్యార్థులు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఎన్ఎంసీ తరఫున కార్యదర్శి ప్రభాత్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేశారు. పైన పేర్కొన్న వివరాలన్నీ ఆ అఫిడవిట్ లో ప్రస్తావించినవే.

Pic: File photo


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • displaced medical students
  • Mahavir Institute of Medical Sciences
  • MNR Medical College and Hospital in Sangareddy district
  • National Medical Commission (NMC)
  • telangana government
  • Telangana High Court
  • TRR Institute of Medical Sciences in Hyderabad
  • Vikarabad

Related News

Telangana High Court movie ticket price hike

సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదే పదే ధరలు పెంచుతూ ప్రభుత్వాలు మెమోలు జారీ చేయడంపై న్యాయస్థానం అసహనం చెందింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ప్రహసనంగా మారిన

  • Divorce Hyd

    భార్యకు వంట రాదని చెప్పి విడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన భర్త

Latest News

  • ఎలోన్ మస్క్ ‘గ్రోక్’పై ఇండోనేషియా నిషేధం!

  • బెంగాలీ మ‌హిళ‌లు ఎక్కువ‌గా ఎరుపు- తెలుపు రంగుల చీర‌లు ఎందుకు క‌ట్టుకుంటారో తెలుసా?!

  • ఇండోనేషియాలో భారీ భూకంపం!!

  • మహిళల్లో పెరుగుతున్న క్యాన్సర్ ముప్పు.. ప్రతి 8 నిమిషాలకు ఒక మరణం!

  • భారత ఈవీ మార్కెట్లోకి సుజుకి ఎంట్రీ.. ధ‌ర ఎంతంటే?!

Trending News

    • టీమ్ ఇండియాకు భారీ షాక్.. ప్రాక్టీస్ సెషన్‌లో రిషబ్ పంత్‌కు గాయం!

    • తెలంగాణ ఎప్‌సెట్ అభ్యర్థులకు శుభవార్త!

    • అయోధ్యలో కలకలం.. రామ్ మందిర్ ప్రాంగణంలో నమాజ్‌?!

    • ఎస్బీఐ రియల్ టైమ్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. 35 లక్షల వరకు పర్సనల్ లోన్!

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd