KTR : కేటీఆర్ కు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలకాలని ధర్మపురి పిలుపు
KTR Padayatra : కేసీఆర్ (KCR) కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని దాంతో హరీశ్ రావు (Harish Rao) పాదయాత్రకు ప్లాన్ చేసారని, ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ (KTR) ఆయన కంటే ముందే తన పాదయాత్రను డిక్లేర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు
- Author : Sudheer
Date : 03-11-2024 - 1:43 IST
Published By : Hashtagu Telugu Desk
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) కేటీఆర్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ గ్రామాల్లో పాదయాత్ర చేస్తే ప్రజలు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలుకాలని సూచించారు. కేసీఆర్ (KCR) కు ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిందని దాంతో హరీశ్ రావు (Harish Rao) పాదయాత్రకు ప్లాన్ చేసారని, ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ (KTR) ఆయన కంటే ముందే తన పాదయాత్రను డిక్లేర్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆదివారం నిజామాబాద్ లో జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అర్వింద్.. కేటీఆర్ ను పాదయాత్ర చేస్తే ఎవ్వరు అడ్డుకోరని , పదేళ్లపాటు విచ్చలవిడిగా పాలన సాగించి ఇప్పుడు పాదయాత్ర చేసి ఏం చేస్తారని నిలదీశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎన్ని కట్టారు? ఎంత మంది దళితులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇచ్చారని ప్రశ్నించారు. కంపెనీల వద్ద కమీషన్లు దండుకున్నారని కాళేశ్వరం ప్రాజెక్టుల్లో ప్రాజెక్టులు లేకున్నా పైపుల కోసం పేమెంట్లు చేశారని ధ్వజమెత్తారు. దీనికంటే విచ్చలవిడి తనం మరొకటి ఉంటుందా కేటీఆర్ అని ధర్మపురి అన్నారు. ప్రజల అభీష్టం మేరకే పాదయాత్ర అంటున్న కేటీఆర్ ను ఏ ప్రజలు పాదయాత్ర చేయమన్నారన్నారని నిలదీశారు. పదేళ్లు అధికారంలో ఉండి కళ్లు నెత్తికెక్కి, కాళ్లు గాల్లో వేలాడుతున్నాయని ఇకనైనా తీరు మార్చుకుని భూమిమీదకు రావాలని ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్తే కేటీఆర్ దాన్ని పాదయాత్ర అని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని సెటైర్ వేశారు.
Read Also : AP Liquor Policy : ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తున్న మహిళలు