DGP Anjani Kumar : డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్..
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ ఇలా రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది
- By Sudheer Published Date - 07:06 PM, Sun - 3 December 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ (Anjani Kumar)పై ఈసీ (Election Commission) సస్పెన్షన్ వేటు వేసింది. ఉదయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న తరుణంలో డీజీపీ నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం..ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలుపడం ఫై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర పోలీస్ బాస్ గా ఉన్న డీజీపీ ఇలా రేవంత్ రెడ్డిని కలవడంపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై వేటు వేసినట్లు సమాచారం. అదనపు డీజీలు ఐపీఎస్ అధికారులు మహేష్ భగవత్, సంజయ్ జైన్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది ఈసీ. రేవంత్ ను కలవడం వెనుక కారణాలు ఏంటో తెలుపాలని ఆదేశించింది.
Read Also : KCR Resigns to CM Post : సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా..