Deputy CM Bhatti : రైతు ఆత్మహత్య ఫై డిప్యూటీ సీఎం భట్టి స్పందన
రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం.. పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు
- Author : Sudheer
Date : 03-07-2024 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ లో వరుసగా రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాన్ని విమర్శల పాలుచేస్తుంది. కొంతమంది అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే..మరికొంతమంది భూ అక్రమాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇలాకాలో పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య (Darmer suicide in khammam district) చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తమగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై విపక్ష పార్టీలు అధికార పార్టీ ఫై విమర్శలు, ఆరోపణలు చేస్తుంది.
ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు భోజడ్ల ప్రభాకర్‌కు తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని, అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోలేదని చెప్పి తీవ్ర ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మ హత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఫై బిఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఈ క్రమంలో ఈ ఘటన ఫై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నెల 6వ తేదీన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ కాబోతున్న నేపథ్యంలో గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ.. చంద్రబాబుతో బంధంపై రేవంత్ రెడ్డి చాలా సార్లు బహిరంగంగానే చెప్పారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు కాదని.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచరుడు మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు, రేవంత్ గురు శిష్యులు అనే కొందరు చేసేవి అవగాహన లేని మాటలని కొట్టి భట్టి పారేశారు. అలాగే తన నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య ఫై కూడా స్పందించారు. రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం.. పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు. ఎవరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన వారిని పట్టుకొని చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం అని పేర్కొన్నారు.
ఖమ్మం రైతు భోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్య పై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం.. పుట్టింది బతకడానికే కానీ చావడానికి కాదు
ఎవరు కూడా ఇలా ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అయిన వారిని పట్టుకొని… pic.twitter.com/Dr4Mgp8sq5
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2024
Read Also : White Paper on Amaravati : ఏపీ రాజధాని అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం