Deputy CM Mallu Bhatti : ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శ్రీకారం
Deputy CM Mallu Bhatti : ఈ పర్యటనలో ఆయన మండలంలోని పలు గ్రామాలను సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు
- By Sudheer Published Date - 01:57 PM, Sun - 19 January 25

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం (Errupalem) మండలంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన మండలంలోని పలు గ్రామాలను సందర్శించి, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమై, వారి అవసరాలు తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. నరసింహపురం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక సౌకర్యాలు తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభమవుతాయని, ఆర్థిక కార్యకలాపాలు వేగవంతమవుతాయని తెలియజేశారు. తర్వాత బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. విద్య అభివృద్ధి గ్రామీణ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, అందుకు తగినన్ని వనరులు కేటాయించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అనంతరం బనిగండ్లపాడు లో రూ. 1.56 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆసుపత్రిని, అలాగే అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మాణం చేసిన గోడౌన్లను భట్టి ప్రారంభించారు.
Hands In Pockets : జేబులో చేతులు పెట్టుకుని నడవడం వెనుక ఇంత అర్థం ఉందా..!
చొప్పకట్లపాలెం గ్రామంలో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు. గ్రామాల్లో ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే లక్ష్యంతో పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమానికి మంచి స్పందన ఇవ్వడం విశేషం. బనిగండ్లపాడు గ్రామంలో కూడా డిప్యూటీ సీఎం పర్యటించి, అక్కడి రైతులతో సమావేశమయ్యారు. వ్యవసాయానికి సంబంధించి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన సమస్యలను సేకరించారు. గ్రామాల అభివృద్ధి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, అందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.