Rani Rudrama Devi Airport : వరంగల్ ఎయిర్ పోర్ట్ కు ‘రాణి రుద్రమదేవి’ పేరు పెట్టాలని డిమాండ్
Warangal Airport : శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ను అనుమతించకూడదన్న జీఎంఆర్ ఒప్పందం కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలం నిలిచిపోయింది
- By Sudheer Published Date - 11:15 AM, Sat - 1 March 25

వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు(Warangal Mamnoor Airport)కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం స్థానిక ప్రజలకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం వరంగల్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తోంది. అయితే శంషాబాద్ విమానాశ్రయానికి 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త ఎయిర్‌పోర్ట్‌ను అనుమతించకూడదన్న జీఎంఆర్ ఒప్పందం కారణంగా ఈ ప్రాజెక్ట్ కొంతకాలం నిలిచిపోయింది. అయితే తాజా పరిణామాలతో ఈ అవరోధం తొలగిపోవడంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది.
AP News : ఏపీవాసులారా.. నేటి నుంచి ఆ రూల్స్ అమలు.. చూసుకోండి..!
ఈ విమానాశ్రయ నిర్మాణానికి దాదాపు 1000 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటికే 650 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. మిగిలిన భూసేకరణ ప్రక్రియ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడంతో అనుమతులు లభించాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి విమానాలు నడిపేలా ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది.
Super Billionaires : మరో కీలక మైలురాయి సొంతం చేసుకున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ ఆదానీ
ఇదిలా ఉండగా మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు “రాణి రుద్రమదేవి ఎయిర్‌పోర్ట్” (Rani Rudrama Devi Airport) అనే పేరు పెట్టాలని వరంగల్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కాకతీయుల వారసత్వాన్ని ప్రతిబింబించేలా రాణి రుద్రమదేవి పేరు ఉంటే మంచి గుర్తింపు వస్తుందని స్థానికులు భావిస్తున్నారు. వరంగల్ అంటే కాకతీయుల పరిపాలనకు ప్రతీక అని, వారు నిర్మించిన గొప్ప కట్టడాలు, వారసత్వ సంపదను గౌరవిస్తూ ఎయిర్‌పోర్టుకు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని ఉద్యమిస్తున్నారు. ఈ డిమాండ్‌కు మద్దతుగా రూపొందించిన ఏఐ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.