BRS MLC Kavitha Arrest : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..
బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తూ వచ్చారు
- Author : Sudheer
Date : 15-03-2024 - 6:10 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్తో వచ్చిన 12 మంది అధికారులు సుమారు 4 గంటలపాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేసి, పలు డాక్యుమెంట్లను, కవిత ఫోన్లను సీజ్ చేశారు. కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కవిత నివాసం వద్దకు భారీగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు , అభిమానులు, మహిళలు ఇంటి వద్దకు చేరుకున్నారు. కవిత అరెస్ట్ కు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేస్తూ మోడీ కి , బిజెపి కి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పోలీసులు భారీగా చేరుకొని.. అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మధ్యాహ్నం నుండి బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 12 మంది అధికారుల బృందం, ఐటీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేస్తూ వచ్చారు. కవిత వద్ద నుండి 16 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవడం తో పాటు కీలక పత్రాలు సేకరించారు. ఈడీ అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రాతిపదికన తనను అరెస్ట్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ దశలో ఉందని మరోసారి అధికారుల దృష్టికి తెచ్చారు. అయితే ఇప్పటికే ఆమెను అదుపులోకి తీసుకున్న ఈడీ.. రాత్రి 8 :45 ఫ్లైట్కు ఆమెను ఢిల్లీకి తీసుకెళ్ళబోతున్నట్లు తెలుస్తుంది. కవిత అరెస్ట్ సమాచారం అందుకున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మరికాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా కవిత ఇంటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
War of words between @KTRBRS and #ED officials on the arrest of @RaoKavitha in the #DelhiLiquorPolicyCase.#kavitha #EnforcementDirectorate pic.twitter.com/jf97qVZZbF
— dinesh akula (@dineshakula) March 15, 2024
We’re now on WhatsApp. Click to Join.
Read Also : Pushpa 2 : పుష్ప 2.. ఓవర్సీస్ రైట్స్ పై కన్నేసిన పుష్ప రాజ్..?