HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Deceased Members Family Allege Trs Leader Targeted Thinking He Is Whistleblower

Medak Suicide: ‘కామారెడ్డి ఘటన’కు టీఆర్ఎస్ నేతల వేధింపులే కారణం!

కామారెడ్డిలో తల్లి కొడుకుల ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాధ్యతగా వ్యవహారించాల్సిన ప్రజాప్రతినిధులు, ఓ పోలీసు అధికారే వారి మరణానికి కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి.

  • By Hashtag U Published Date - 12:23 PM, Tue - 19 April 22
  • daily-hunt
Kamareddy
Kamareddy

కామారెడ్డిలో తల్లి కొడుకుల ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బాధ్యతగా వ్యవహారించాల్సిన ప్రజాప్రతినిధులు, ఓ పోలీసు అధికారే వారి మరణానికి కారణం అనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఓ పోలీసు అధికారి కలిసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని…ఏడాదిన్నరగా వారుడు పెడుతున్న మానసికక్షోభతో మనశ్శాంతి కరువైదంటూ ఓ తల్లి,ఆమెకు కుమారుడు బలవన్మారణానికి పాల్పడ్డారు. వారి వేధింపులపై ఎవరికీ ఫిర్యాదు చేసిన ఫలితం లేదంటూ…కనీసం తమ చావుతోనైనా వారికి శిక్ష పడుతుందన్న ఆశతో ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తర్వాత నిప్పంటించుకుని ప్రాణాలు తీసుకున్నారు.

అసలేం జరిగింది….
ఏప్రిల్ 14 గురువారం రాత్రం గంగం సంతోష్ తన అన్నయ్య శ్రీధర్ కు ఫోన్ చేసి…తాను అధికారపార్టీకి చెందిన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ ఛైర్మన్, అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్, ఓ పోలీస్ ఇన్ స్పెక్టర్ వేధింపులతో తాను విసిగిపోయానని..ఇక భరించలేని చెప్పాడు. తమ్ముడితో, అమ్మతోనూ అదే చివరి కాల్ అవుతుందని శ్రీధర్ కు తెలియదు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన సంతోష్ వృత్తిరీత్యా రియల్టర్. సంతోష్ గత 18నెలలుగా పురపాలక సంఘం చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మాన్ సరాఫ్ యాదగిరి, పోలీసు ఇన్ స్పెక్టర్ నాగార్జున గౌడ్ నుంచి వేధింపులకు పాల్పడ్డారని సంతోష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే వేధింపులు మొదలయ్యాయని…సంతోష్ అన్న శ్రీధర్ తెలిపాడు.

మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్, మార్కెట్ ఛైర్మన్ సరఫ్ యాదగిరి చేసే అక్రమాలు, అన్యాయాలు సహించలేక 2020లో ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టాడు. కానీ దానికి తనను బాధ్యుడిని చేసి…పథకం ప్రకారం 2020 నవంబర్ 24న అప్పటి సీఐ నాగార్జున గౌడ్ దగ్గరికి పిలిపించారు. ఆ పోస్టుతో నాకు సంబంధం లేదని చెప్పినా సీఐ వినలేదని.. నాకు మొబైల్ తీసుకుని పంపించారు. దీనిపై మెదక్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో…డిసెంబర్ 3న మొబైల్ తిరిగి ఇచ్చారు. కానీ సీఐ ఈ 10రోజుల్లో నా మొబైల్లోఉన్న పర్సనల్ డేటా, బిజినెస్ డిటైల్స్ తీసుకుని మున్సిపల్ ఛైర్మన్ కు ఇఛ్చారు. తర్వాత తన పర్సనల్ డేటా బయటపెడతానంటూ జితెందర్ గౌడ్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించారు. దీనిపై ఎంతో మంది అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశా. అయినా ఎలాంటి ఫలితం లేదు. నా పర్సనల్ డేటాను అడ్డుపెట్టుకుని రకరకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. డబ్బులు డిమాండ్ చేశారు. వీరి వేధింపులతో ఆస్తులు నష్టపోయాను. అప్పులు చేయాల్సి వచ్చింది. మనశ్శాంతి కరువైంది. ఏడాది కాలంగా మానసికక్షోభ అనుభవించాం. తప్పనిపరిస్థితిలోనే అమ్మా..నేను చనిపోతున్నాం…ఇకనైనా అధికారులు స్పందించి మాకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. అని సూసైడ్ లో నోట్ లో పేర్కొన్నాడు.

సంతోష్ తీసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రాజకీయ పార్టీలు, ప్రజలు మృతదేహాలతో జితేందర్ గౌడ్ ఇంటివద్ద ధర్నాచేశారు. జితేందర్ గౌడ్, సరాఫ్ యాదగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తాను కూడా భాగస్వామ్యం కావాలని సంతోష్ ను బలవంతం చేశారని..వచ్చిన లాభాల్లో సంతోష్ కు వాట ఇవ్వలేని శ్రీధర్ తెలిపారు. సంతోష్ వ్యక్తిగత డేటా తీసుకుని మరింత వేధింపులకు గురిచేశారని..తన తమ్ముడు మానసికంగా చాలా దృఢంగా ఉన్నా..వారు పెట్టే టార్చర్ భరించలేని స్థాయికి చేరుకుందని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పాడు.

79c4793054e0d31e6c47a126935b08c9 Imresizer

ఆత్మ‌హ‌త్య చేసుకునేముందు సంతోష్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌

అసలేవరదీ పాపం..?
తల్లీకుమారుల సూసైడ్ నోట్ సెల్ఫీ వీడియోలుసామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో…ఈ ఘటనకు కారకులు ఎవరనే చర్చ జరుగుతోంది. రామయంపేట మున్సిపల్ ఛైర్మన్, ఏఎంసీ ఛైర్మన్ లతోపాటు ఏడాదిన్నరగా గొడవలు జరుగుతున్నాయి. ఫేస్ బుక్ లోని పోస్టు వ్యవహారంలో వారు సంతోషపై ఫిర్యాదు చేశారు. సంతోష్ ను పిలిపించిన సీఐ నాగార్జున అతని సెల్ ఫోన్ తీసుకోవడం,…అందులోని డేటాను అధికారపార్టీల నేతలకు ఇవ్వడం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎస్పీ నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం కార్యాలయం వరకు ఫిర్యాదు చేసినా…ఎందుకు స్పందించలేదన్న సందేహాలు వస్తున్నాయి. సంతోష్ తనను ఏడుగురు వ్యక్తులు వేధిస్తున్నారని…తాను చనిపోతే కారకులు వారేనని పేర్కొంటూ జనవరి 13న రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసినట్లుగా కాపీపై పీఎస్ స్టాంప్ కూడా వేయించుకున్నాడు. సంతోష్ తాను ఆత్మహత్య చేసుకునే ముందుకు ఈ లేఖ సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. సంతోష్ ఫిర్యాదుతో పోలీసులు స్పందించినా ఫలితం ఉండేదని బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అధికార పార్టీ నేతల వల్లే తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gangam Santhosh
  • medak
  • Municipal Council Chairman and Agriculture Market Chairman
  • Ramayampet
  • telangana

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd