HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Dasoju Sravan Comments On Revanth Reddy 2

BRS : కోదండరాంపై సీఎం రేవంత్ రెడ్డిది మొసలి కన్నీరు : దాసోజు శ్రవణ్

నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు.

  • Author : Latha Suma Date : 26-08-2025 - 11:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Dasoju Sravan Comments on Revanth Reddy,
Dasoju Sravan Comments on Revanth Reddy,

BRS  : తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణల పర్వం ఊపందుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రొఫెసర్ కోదండరాంపై సీఎం చూపిస్తున్న ప్రేమ దిష్టిబొమ్మ మాత్రమేనని, అది మొసలి కన్నీరు కంటే ఎక్కువ కాదని ఆయన విమర్శించారు. నిజంగా కోదండరాంపై అభిమానం ఉంటే, వెంటనే సీఎం పదవి ఆయన్నే అప్పగించాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. రెవంత్ రెడ్డికి నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన కన్నా కోదండరాం అన్ని విధాలా ఉత్తమ నాయకుడని దాసోజు అభిప్రాయపడ్డారు. కోదండరాం నాయకత్వం, ఉద్యమశక్తి, ప్రజలతో ఉన్న అనుబంధం ఆయనను తక్షణమే ముఖ్యమంత్రి పదవికి అర్హుడిగా చేస్తాయి. కనీసం ఆయనను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలి అని అన్నారు. అలాగే, రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కోదండరాంకు బరిలో దించాలని సూచించారు.

Read Also: Doom Scroller : సోషల్ మీడియాలో స్క్రోలింగ్‌తోనే జాబు.? వైరల్ అవుతున్న “డూమ్-స్క్రోలర్” ఉద్యోగం

రెవంత్ రెడ్డి ఇటీవల ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేసిన ప్రసంగాన్ని శ్రవణ్ తిప్పికొట్టారు. ఆయన మాట్లాడింది అంతా సొల్లు పురాణం. నిజంగా విద్యా వ్యవస్థపై ప్రేమ ఉంటే, వెంటనే ఓయూకు వెయ్యి కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలి” అంటూ ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. బడ్జెట్ లో మాటలకన్నా కేటాయింపులే ముఖ్యమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రేవంత్ రెడ్డి ఎలా మాట్లాడతారని శ్రవణ్ ప్రశ్నించారు. “అదేంటంటే కేసు కోర్టులో ఉండగానే వ్యాఖ్యలు చేయడం ద్వారా న్యాయవ్యవస్థను అవమానిస్తున్నారు. ఇది న్యాయమూర్తుల పరంపరను అనాగరికంగా తక్కువచేయడమే అని అన్నారు. తెలంగాణ కోసం ఎందరో యువకులు ప్రాణాలర్పించిన సమయంలో రేవంత్ చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్నారని శ్రవణ్ గుర్తుచేశారు.

శ్రీకాంతాచారి, యాదయ్య వంటి వారు ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసినప్పుడు, రేవంత్ చంద్రబాబు పక్కనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఉద్యమ నాయకుడిలా ప్రవర్తించడం నాటకమే అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అప్పులు రూ. 3,50,520 కోట్లు మాత్రమేనని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి వెల్లడించారని శ్రవణ్ చెప్పారు. ఇప్పటి ప్రభుత్వం మాత్రం నిజాలు దాచే ప్రయత్నం చేస్తోంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు. చివరిగా, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందనే భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి అశాంతిగా ప్రవర్తిస్తున్నారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న విశ్వాసం ఆయనకు బెంగలేకుండా లేదు. అందుకే ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Arvind Kejriwal : అవినీతిపరులను ప్రోత్సహించే నేతలు రాజీనామా చేయరా?: అమిత్ షాకు కౌంటర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Dasoju Shravan
  • Jubilee Hills by-election
  • kaleshwaram project
  • kodandaram
  • OU
  • revanth reddy
  • Telangana Debts

Related News

Harish Rao Kanchukota

Siddipet : హరీష్ రావు కంచుకోటాను కదిలించే దమ్ము రేవంత్ కు ఉందా ?

ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో తనకంటూ ఒక పటిష్టమైన యంత్రాంగాన్ని నిర్మించుకున్న హరీష్ రావును కేవలం ఒక 'మంత్రి పదవి' హామీతో ఢీకొట్టడం రేవంత్ రెడ్డికి పెను సవాలుగానే కనిపిస్తోంది.

    Latest News

    • New Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్..

    • Gold Price : మళ్లీ దడ పుట్టిస్తున్న బంగారం ధరలు..ఈరోజు తులం ఎంత పెరిగిందంటే !!

    • Vijayawada Durga Temple: దుర్గ గుడి లో సిబ్బంది చేతివాటం

    • Train Derailment: నెల్లూరులో పట్టాలు తప్పిన గూడ్స్‌ ట్రైన్..

    • Human Trafficking: కట్టుకున్న భార్యను 120 మంది పురుషులకు అమ్మేసిన భర్త.

    Trending News

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd