HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Da Release For Employees On June 2nd

Release of DA : ఉద్యోగులకు జూన్ 2న డీఏ విడుదల?

Release of DA : అవిర్భావ దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

  • Author : Sudheer Date : 25-05-2025 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tg Da
Tg Da

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Telangana State Government Employees) శుభవార్త. జూన్ 2న రాష్ట్ర అవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా పెండింగ్‌లో ఉన్న డియర్‌నెస్ అలవెన్స్‌ (DA) చెల్లించనున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ వర్గాల నుంచి లభిస్తున్న సమాచారం ప్రకారం, పెండింగ్‌లో ఉన్న డీఏలలో ఒకదాన్ని ఈ సందర్భంగా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇది వేలాది మంది ఉద్యోగులకు, పెన్షన్‌దారులకు ఆర్థిక ఊరట కలిగించనుంది.

Fourth Largest Economy: నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్.. టాప్ -10లో ఉన్న దేశాలివీ

ఇది మాత్రమే కాకుండా, ఇతర పెండింగ్ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్లను కూడా త్వరితగతిన చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ కొత్త ఆరోగ్య పథకాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాలు అధికారుల కమిటీతో జరిగిన చర్చల అనంతరం తీసుకున్నవిగా చెబుతున్నారు. కొన్ని కీలక డిమాండ్లను అధికారులు అంగీకరించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి‌తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమైన తర్వాత ముఖ్య కార్యదర్శి (CS) అధికారిక ప్రకటన చేయనున్నారని సమాచారం. అవిర్భావ దినోత్సవం రోజున ఈ ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో ఉద్యోగ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ముందడుగు వేయడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • da
  • Release of DA
  • telangana

Related News

Tg Cabinet (1)

మేడారంలో తెలంగాణ క్యాబినెట్ భేటీ, చరిత్రలో ఇదే తొలిసారి !!

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, రాజధాని హైదరాబాద్ వెలుపల తొలిసారిగా మేడారంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు

  • There should be a system where money is automatically deducted if a challan is issued: CM Revanth Reddy

    చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

  • Cm Revanth Mptc Zptc

    జిల్లాల పునర్విభజన కోసం కమిటీ ఏర్పాటు చేయబోతున్న సీఎం రేవంత్

  • Bhatti Nirmala Sitharaman

    ప్రీ బడ్జెట్ సమావేశం, నిర్మలమ్మ కు భట్టి విజ్ఞప్తులు

  • Revanth Govt Movie Tickets

    సినిమా టికెట్ ధరల విషయంలో పదే పదే మాట మారుస్తూ విమర్శలు ఎదురుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • కుంకుమ పువ్వు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?.. ఎలా వాడాలి?

  • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

  • ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి

  • చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?

  • భోగి పళ్ళు అంటే ఏమిటి?..పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.?

Trending News

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

    • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

    • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd