Manne Krishank : బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కు సైబర్ క్రైమ్ నోటీసులు
హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని నోటీసు లో పేర్కొన్నట్లు క్రిశాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు
- By Sudheer Published Date - 05:59 PM, Mon - 15 April 24

బీఆర్ఎస్ (BRS) సోషల్ మీడియా కన్వీనర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ మన్నె క్రిశాంక్ (Manne Krishank) కు హైదరాబాద్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ నోటీసులు (Cyber Crime Notice ) జారీ చేసింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసుల అందాయని తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి అతని సోదురుడికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో క్రిశాంక్ ఫై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆ టైం లో 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేసి, అతని ఫోన్ సీజ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు పంపిన నోటీసుల్లో మార్చి 15, 2024 తేదీన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు అయ్యిందని, ఈ కేసులో వాస్తవాలను నిర్ధారించడానికి మిమ్మల్ని ప్రశ్నించడానికి సరైన ఆదారాలున్నాయని వెల్లడైంది. ఈ నేపధ్యంలో మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఉండటంతో.. ఈ నెల 17 లోగా హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని నోటీసు లో పేర్కొన్నట్లు క్రిశాంక్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
ఇక క్రిశాంక్ బ్యాక్ గ్రౌడ్ చూస్తే..విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. కొంతకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసిన తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. గత ఎన్నికల్లో కంటోన్మెంట్ సీటు ఆశించిన క్రిశాంక్‌కు భంగపాటు తప్పలేదు. అక్కడి నుంచి లాస్య నందిత బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా కొనసాగుతుండగా.. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీల తప్పులను ఎత్తి చూపుతూ పోస్టులు పెడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులు అందుతూ వస్తున్నాయి.
Read Also : Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ