Davos : తెలంగాణలో మరో రూ.10వేల కోట్ల పెట్టుబడులు..రేవంతా మజాకా..!
Davos : కంట్రోల్ ఎస్ సంస్థ (Control S Company)తో రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది
- By Sudheer Published Date - 02:02 PM, Wed - 22 January 25

దావోస్ పర్యటన(Davos Tour )లో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కంట్రోల్ ఎస్ సంస్థ (Control S Company)తో రూ. 10,000 కోట్ల పెట్టుబడులతో AI డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఈ కీలక ప్రాజెక్ట్ 400 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించబడతుందని తెలుస్తోంది. తెలంగాణలో ఐటీ రంగ అభివృద్ధికి ఈ పెట్టుబడులు మరింత ఊతం కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో 3,600 మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. డేటా సెంటర్ క్లస్టర్ దేశవ్యాప్తంగా సేవలను అందించడమే కాకుండా, హైదరాబాదు కేంద్రంగా మరింత వ్యాప్తిని పొందనుంది. ఇప్పటికే కంట్రోల్ ఎస్ సంస్థ హైదరాబాదులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దావోస్ ఒప్పందం ద్వారా సంస్థ తెలంగాణపై మరింత దృష్టి సారించడం రాష్ట్రానికి గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడంలో కొనసాగుతున్న సక్సెస్‌తో పరిశ్రమలు రాష్ట్రంలో తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ, డేటా మేనేజ్‌మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉంది. కంట్రోల్ ఎస్ సంస్థ తాజా నిర్ణయం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది.
అవసరమైన మౌలిక వసతులు, ప్రొఫెషనల్ వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహక పాలసీలు వంటి అంశాలతో తెలంగాణ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హైదరాబాదు, ప్రస్తుతం ఇండియా డేటా సెంటర్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ ఒప్పందం తెలంగాణ ఆర్థిక రంగంలో కూడా కీలక మార్పులను తీసుకురానుంది. దావోస్ పర్యటన ద్వారా వచ్చిన పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద విజయంగా చెప్పవచ్చు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా నిలవడం, డేటా సెంటర్ వంటి కీలక ప్రాజెక్టులు తెలంగాణ ప్రతిష్టను పెంచుతున్నాయి. ఇంత భారీ పెట్టుబడులు రావడంలో రేవంత్ బృందం సక్సెస్ అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు “రేవంతా మజాకా!” అని ప్రశంసిస్తున్నారు.