HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Support To Bcs In Telangana

Congress : బీసీల‌కు అండ‌గా కాంగ్రెస్‌.. అధికారంలోకి రాగానే.. ?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త‌న దూకుడుని ప్ర‌ద‌ర్శిస్తుంది. రానున్న‌ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని వైపుల నుంచి

  • Author : Prasad Date : 22-06-2023 - 8:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ త‌న దూకుడుని ప్ర‌ద‌ర్శిస్తుంది. రానున్న‌ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అన్ని వైపుల నుంచి అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూత్ లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకొనేందుకు ప్రకటించిన డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే బీసీ సామాజిక‌వ‌ర్గాల క‌ష్టాల‌పై ఫోకస్ పెట్టింది. బీసీల‌కు అండగా నిలుస్తూ వారి మద్దతు కూడగట్టేందుకు సిద్దం వుతోంది. బీసీ డిక్లేరేషన్ లో అనూహ్య నిర్ణయాలతో తెలంగాణ కాంగ్రెస్ ముంద‌కు వ‌స్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 40% రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టాలని యోచిస్తోంది. త్వరలో సూర్యాపేటలో బీసీ గర్జన సభను భారీ ఎత్తున నిర్వహించాలని నిర్ణయించింది. క‌ర్ణాట‌క సీఎం సిద్దరామయ్య చేత బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించేలా ఆలోచన చేస్తోంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ గా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది. యూత్ డిక్లరేషన్ ప్రియాక గాంధీ ప్రకటించటంతో యువతలో నమ్మకం పెరిగింది. ఇప్పుడు అదే తరహాలో బీసీ డిక్లరేషన్ కు ప్లాన్ చేస్తోంది. తాము ప్రకటించిన తరువాత బీఆర్ఎస్, బీజేపీ ఏం చేసినా బీసీ వర్గాలు నమ్మే పరిస్థితి లేదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. బీఆర్ఎస్ తమ మేనిఫెస్టోకు అనుగుణంగా ఏదైనా చెప్పినా తొమ్మిదేళ్ల కాలంలో అమలు చేయని పార్టీగా ఇప్పటికే ముద్ర పడిందని..ఇక నమ్మే పరిస్థితి ఉండదని భావిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను తిరిగి జాబితాలో చేర్చుతామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హామీ ఇస్తున్నారు. పార్టీ మేనిఫెస్టోలో వెనుకబడిన తరగతుల న్యాయమైన డిమాండ్లను కూడా చేర్చుతామని చెబుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచేలా చర్యలు తీసుకొంటామని ప్రకటకు సిద్దం అవుతున్నారు. బీసీ మేనిఫెస్టో రూపకల్పన సమయంలో బీసీ సంఘాల ముఖ్యుల అభిప్రాయాలకు విలువ ఇచ్చేలా వారికి భాగస్వామ్యం ఇవ్వాలని ఆలోచన చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం బీసీ కులవృత్తులకు లక్ష సాయం ప్రకటన కూడా మోసపూరితంగా మారుతోంది. కేవలం14 బీసీ కులవృత్తులకే లక్ష సాయం ఇస్తామంటోందని, బీసీ జాబితాలోని 130 కులాలకు ఈ స్కీమ్ ను అమలు చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

తెలంగాణలో ఎన్నికల్లో గెలవాలంటే బీసీ వర్గాలదే డిసైడింగ్ ఫ్యాక్టర్. దీంతో గతం కంటే ఎక్కువగా బీసీలకు సీట్లు కేటాయించే ఆలోచన కూడా జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో ఒకటి , రెండు వర్గాలకే ప్రాధాన్యత దక్కుతుందనే అభిప్రాయం బీసీల్లో బలంగా ఉంది. అదే సమయంలో బీజేపీలోనూ అదే తరహాలో పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఒక్కో వర్గం సమస్యల పైన ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా బీసీలకు 50 శాతం టికెట్లు దిశగా ఆలోచన జరుగుతోంది. బీసీ గణన పైన పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని పార్టీ భావిస్తోంది. బీసీ డిక్లరేషన్ పూర్తయిన తరువాత మహిళలు..రైతుల అంశాల పైన వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టాలని భావిస్తోంది


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc declaration
  • bhatti vikramarka
  • congress
  • PCC Chief revanth reddy
  • Rahul Gandh
  • telangana congress

Related News

AICC issues show-cause notice to Shabbir Ali.

Shabbir Ali: షబ్బీర్‌అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆడియో క్లిప్ వైరల్ కావడంతో పార్టీ హైకమాండ్ సీరియస్‌గా స్పందించింది. మహిళలను కించపరిచేలా, అలాగే పార్టీ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. వైరల్ అయిన ఆడియోలో టీప

    Latest News

    • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

    • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

    • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

    • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

    • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd