HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Partys Patent For Corruption Not Free Electricity Brs Leaders

Power Politics: ఉచిత విద్యుత్ కు కాదు అవినీతికి కాంగ్రెస్ పార్టీ పేటెంట్: బీఆర్ఎస్ నేతలు

24 గంటల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ తన విదానాన్ని బహిర్గతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు

  • Author : Balu J Date : 15-07-2023 - 2:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pressmeet
Pressmeet

వ్యవసాయానికి తెలంగాణా ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్ పార్టీ తన విదానాన్ని బహిర్గతం చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా కాంగ్రెస్ పార్టీ విధానమే అయితే గతించి పోతున్న ఆ పార్టీకీ ఊపిరి పోసిన రాజస్థాన్, శ్వాస నందించిన చత్తీస్ ఘడ్,సంజీవినీని అందించి ప్రాణం పోసిన కర్ణాటక రాష్ట్రాలలో ఎందుకు 24 గంటలు ఉచితంగా సరఫరా చేయడం లేదో తేల్చి చెప్పాలని ఆయన నిలదీశారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు రాష్ట్రానికో విధానం ఉండదని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్ లోని బి ఆర్ ఎస్ ఎల్ పి కార్యాలయంలో సహచర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తుంగతుర్తి శాసన సభ్యులు గాధరి కిశోర్ కుమార్ తదితరులతో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్ది మాట్లాడారు.

ఉచిత విద్యుత్ కు పేటెంట్ గా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ విధానాన్ని అమలు పరిచారని చెప్పుకుంటున్న వై ఎస్ గానీ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఏనాడు ఉచ్చరించ లేదన్నారు.అలా ఉచ్చరించి ఉంటే ఆ రికార్డ్ లు బహిరంగ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. తెలిసో తెలియక ఆ పార్టీ అధినేత మూడు నుండి ఎనిమిది గంటలు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా సరిపోతుందంటే అందుకు అనుగుణంగా ఆయన వెంట ఆ పార్టీ నేతలు అదే రాగాన్ని ఆలపిస్తున్న వైనం చూస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ విధానంగా కనిపిస్తుందన్నారు.అనువైన సమయంలో రైతాంగం వినియోగించు కోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ను అందుబాటులో ఉంచితే దానిని చూసి ఆ పార్టీ నేతలు సహించుకోలేక పోతున్నారన్నారు.పొర పాటున ఆ పార్టీకీ అక్కడక్కడా ఓటేస్తే ఎకరం ఉన్న రైతులకు గంట,రెండు ఎకరాలు ఉన్న రైతుకు రెండు గంటలు మూడు ఎకరాలు ఉన్న రైతుకు మూడు గంటలు గరిష్టంగా 8 గంటలు సరఫరా చెయ్యడం ఆ పార్టీ విధానంగా రూపొందించుకున్నట్లు మూడు రోజులుగా కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట జారుతున్న మాటలు రుజువు పరుస్తున్నాయాన్నారు.

ఇంటికి 24 గంటలు సరఫరా ఉండాలి,వాణిజ్య,వ్యాపారాలకు 24 గంటలు సరఫరా ఉండాలి,పరిశ్రమలకు 24 గంటలు ఉండాలి వ్యవసాయ దారులకు మాత్రం 8 గంటలు చాలు అన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరిగా తేట తెల్లం అవుతుందన్నారు.విద్యుత్ వినియోగ దారులందరికి 24 గంటలు సరఫరా చేస్తున్నట్లే రైతాంగానికి 24 గంటలు సరఫరా చెయ్యాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన సుస్పష్టం చేశారు.చీటికీ మాటికి గల్లీ నుండి ఢిల్లీ వరకు పేటెంట్ పేటెంట్ అంటూ చిలక పలుకులు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వారి పార్టీ అధికారంలో ఉన్న చత్తీస్ ఘడ్ లో వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చెయ్యక పోగా అమ్ముకుంటున్నారని అటువంటి మోసాన్ని ఎండగట్టకపోతే తెలంగాణా రైతాంగానికి మొదటికే మోసం వస్తుందని ఆయన హెచ్చరించారు. అవును వారు పేటెంట్లే గల్లీ నుండి ఢిల్లీ వరకు అధికారాన్ని అనుభవించి జైలులో ఊచలు లెక్కపెట్టిన వారు అవినీతికి మాత్రమే పేటెంట్ దారులని ఆయన ఎద్దేవాచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమి చేసాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నారని ఆయన విరుచుకుపడ్డారు.

40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తులు కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులకు పెరగడమే ముఖ్యమంత్రి కేసీఆర్ పని తీరుకు నిదర్శనమన్నారు.తెలంగాణా ప్రజలను మోసం చేయడానికే కాంగ్రెస్ పార్టీ వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ మీద చర్చకు తెర లేపిందన్నారు.గృహ వినియోగదారుల నుండి మొదలు వర్తక వ్యాపార,వాణిజ్య ,పరిశ్రమలకు సరఫరా 24 గంటల విద్యుత్ పై ఎందుకు మాట్లాడడం లేదని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇందులో దాగి ఉన్న మర్మం కనిపెట్టాలని తెలంగాణా రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. కేవలం వ్యవసాయానికి సరఫరా చేస్తున్న ఉచిత విద్యుత్ పై చర్చ పెడుతున్నారు అంటే దాని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్రకు తెరలేపిందన్న అనుమానం కలుగుతోందన్నారు.అవాకులు చెవాకులు పేలుతున్న ఈ ప్రబుద్ధుల పాలనలోనే కదా సబ్ స్టేషన్ ల ముట్టడిలు, ధర్నాలు,రాస్తారోకోలు,ఆందోళనలు జరిగిందని ఆయన దుయ్యబట్టారు.

వాతాన్నింటిని మరచి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాతో బీడు భూములన్నీ సస్యశ్యామలంగా మారి రైతాంగం సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంటే వారిలో అలజడి లేపేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకు తెర లేపినట్లుందన్నారు.గృహ వినియోగదారులకు,వర్తక వ్యాపార,వాణిజ్య,పరిశ్రమలకు 24 గంటలు సరఫరా ఉండొచ్చు కానీ వ్యవసాయానికి మూడు గంటల నుండి 8 గంటలకు పరిమితము చెయ్యలన్న కాంగ్రెస్ పార్టీ నేతల మాటల్లోనే కాంగ్రెస్ పార్టీ వైఖరి బహిర్గతం అయిందన్నారు.అటువంటి దుర్మార్గాన్ని ఎండ గట్టేందుకు తెలంగాణా రైతాంగం ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ రైతు సంఘంతో పాటు అన్ని పార్టీల రైతు సంఘలా ప్రతినిధులు రైతువేదికల మీద,రచ్చబండల కాడ వ్యవసాయానికి మూడు గంటల నుండి ఎనిమిది గంటలు సరఫరా చాలు అన్న కాంగ్రెస్ పార్టీ నేతల ప్రకటన పై చర్చించి తీరాల్సిందే నని మంత్రి జగదీష్ రెడ్డి ఆయా సంఘలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Gun Fire: సిటీ శివారులో కాల్పుల కలకలం, వివాహేతర సంబంధమే కారణం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRS Leaders
  • hyderabad
  • Jagadeesh Reddy
  • Power Politics

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • HYDRAA

    HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

Latest News

  • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

  • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

  • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

  • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd