HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Congress Party Manifesto 2023 Released

T Congress Manifesto 2023 : టి కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..ఆకట్టుకున్న హామీలు

18 ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థినికి స్కూటీ ..నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్.. రూ.10 లక్షల వడ్డీలేని రుణం ..మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ

  • By Sudheer Published Date - 01:29 PM, Fri - 17 November 23
  • daily-hunt
T Congress Manifesto 2023 released
T Congress Manifesto 2023 released

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో టి కాంగ్రెస్ తమ మేనిఫెస్టో ను రిలీజ్ చేసి ఓటర్లను మరింతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెలంగాణ ఎన్నికల (Telangana Assembly Election 2023) పోరులో విజయం ఫై ధీమాగా ఉన్న కాంగ్రెస్..ప్రచారంలో దూకుడు కనపరుస్తుంది. ఓ పక్క ప్రచారం చేస్తూనే..మరోపక్క అధికార పార్టీ (BRS) ఫై విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు (Congress 6 Guarantees ) అంటూ హామీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో వీటి గురించే ప్రధానంగా వివరిస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు మరిన్ని హామీలతో మేనిఫెస్టో ను రిలీజ్ చేసింది. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో అనుబంధంగా మరో 66 హామీలతో కూడిన మేనిఫెస్టో ను రిలీజ్ చేసి ఓటర్లఫై వరాలజల్లు కురిపించింది.

ఆ 66 హామీలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీ హామీలు :-

1. మహాలక్ష్మి

మహిళలకు ప్రతీ నెల రూ.2500 రూ.500 కే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.

2. రైతు భరోసా ప్రతి ఏటా

రైతులకు, కౌలు రైతులకూ ఎకరానికి రూ.15000 వ్యవసాయ కూలీలకు రూ. 12000 వరి పంటకు రూ. 500 బోనస్

3. గృహ జ్యోతి

ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్

4. ఇందిరమ్మ ఇండ్లు

ఇ లేని వారికి ఇంటి స్థలం మరియు రూ.5 లక్షలు ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం.

5. యువ వికాసం

విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు. ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్

6. చేయూత

రూ.4000 నెల వారీ పింఛను (పెన్షన్) రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ భీమా.

ఈ ఆరు గ్యారెంటీ హామీలతో అనుబంధం గా ఈ 66 హామీలు

1. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు, పూర్తి స్థాయి ప్రజాస్వామిక సరిపాలనను అందిస్తాం.

2. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతి రోజూ “ప్రజా దర్బార్” నిర్వహిస్తాం.

3. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యను అమరవీరుల తల్లి/తండ్రి/భార్య కు రూ.25000 ల నెలవారీ గౌరవ పెన్షన్ను, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం..

4. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసి, వారికి 250 గజాల ఇళ్ల స్థలాలను కేటాయిస్తాం..

5. రైతులకు రూ.2 లక్షల పంట ఋణ మాఫీ చేస్తాం.

6. వడ్డీలేని పంట రుణాలను రూ.3 లక్షల వరకు అందచేస్తాం..

7. వ్యవసాయానికి 24 గంటల నిరంతర ఉచిత కరెంట్.

8 . అన్ని ప్రధాన పంటలకు సమగ్ర భీమా పథకాన్ని అందిస్తాం.

8. ఎ. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మా సిటీలను రద్దు చేస్తాం.

9. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరిపిస్తాం..

10. మెగా డీఎస్సీ ని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను 6 నెలల లోనే భర్తీ చేస్తాం..

11. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకంగా నిర్ణీత కాలంలో 2 లక్షల ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం.

12. ప్రతి విద్యార్థి, విద్యార్ధినులకు ఫ్రీ (ఇంటర్నెట్) వైఫై సౌకర్యం కల్పిస్తాం.

13. విద్యారంగానికి బడ్జెట్ లో ప్రస్తుత వాటా 6% నుండి 15% వరకు పెంచుతాం.

14.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని రూ.10,000 లకు పెంచుతాం.

15. మూతబడిన దాదాపు 6 వేల పాఠశాలలను తిరగి మెరుగైన సదుపాయాలతో పునఃప్రారంభిస్తాం.

16. బాసర ట్రిపుల్ ఐటి (IIIT) తరహాలో మరో 4 ట్రిపుల్ ఐటి లను ఏర్పాటు చేస్తాం.

17. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షలకు పెంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింప చేస్తాం..

18. ధరణి పోర్టల్ స్థానంలో “భూనూత” పోర్టల్ను ప్రవేశ పెట్టి భూసొక్కులు కోల్పోయిన రైతులందరికీ న్యాయం చేస్తాం.

19. “ల్యాండ్ కమీషన్” ఏర్పాటు చేసి, అన్ని భూహక్కుల సమస్యలను

20. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూహక్కులను లబ్దిదారులకు కల్పిస్తాం…

21. 73, 74 వ రాజ్యాంగ సవరణల ప్రకారము, మూడంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి, విధులు, నిధులు మరియు నిర్వహణ భాద్యతలను అప్పగిస్తాం.

22. గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు రూ. 1500 ఇస్తాం. అదే విధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జడ్ పీటీసీ సభ్యులకు గౌరవ పెన్షన్ అందచేస్తాం.

23. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ పెండింగ్లో వున్న మూడు DA లను తక్షణం చెల్లిస్తాం.

24. ప్రస్తుతం ఉన్న CPS విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ (OPC) విధానాన్ని అమలు చేస్తాం.

25. ప్రభుత్వ ఉద్యోగులకు, RTC సిబ్బందికి కొత్త PRC ప్రకటించి 6 నెలలలోపు సిఫారసులను అమలు చేస్తాం.

26. ఆర్టీసీ సిబ్బందికి రెండు పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లిస్తాం.

27. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి రూ.12000 లు ఆర్థిక సహాయం అందచేస్తాం.

28. పెండింగ్ లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50% శాతం రాయితీ (one time Settlement) ద్వారా పరిష్కరిస్తాం.

29 . బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం. 30. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగ, నూల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం..

31. బీసీల “కుల గణన” చేసి, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తాం..

32. సంచార జాతులకు విద్య, ఉద్యోగ అవకాశాలతో 5% రిజర్వేషన్ కల్పిస్తాం.

33. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద ‘బిసి భవన్’ ఏర్పాటు చేస్తాం.

34. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం.

35. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులను కేటాయిస్తాం.

36. వెనుకబడిన తరగతులకు (బీసి) సబ్ ప్లాన్ అమలు చేస్తాం.

37. ఈబీసీ ల కొరకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.

38. సరిపడా నిధులతో మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తాం,

39, నిరుపేద హిందూ మరియు మైనారిటీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే రూ. 1,00,000 తో పాటూ ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం ఇస్తాం.

40. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునః పరిశీలించి సరళీకృతం చేస్తాం.

41. సింగరేణి సంస్థ ప్రయివేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించదు.

42. బీడీ కార్మికులకు జీవిత భీనూ, ఈఎస్ఐ పరిధిలోకి తెస్తాం.

43. ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు రూ. 10 లక్షల వరకు, ఎక్స్ గ్రేషియా పెంచుతాం.

44. యాదవ, కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా రూ.2 లక్షల గొర్రెల పెంపకం కోసం అందచేస్తాం.

45. రాజస్థాన్ తరహాలో అసంఘటిత కార్మికులకు, ఉదా: భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, కాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, ఔమాటో (Gig & plat form) వారికి సామాజిక భద్రత కల్పిస్తాం.

46. స్వయం సహాయక బృందాలకు పావలా వడ్డీతో రుణ పరిమితిని రూ. 10 లక్షల వరకు పెంచుతాం.

47. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయంతో కూడిన “బంగారు తల్లి” పధకాన్ని పునరుద్ధరిస్తాం.

48. 18 సంవత్సరాలు పైబడి, చదువుకొనే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందజేస్తాం..

49. అన్ని జిల్లా కేంద్రాలలో “ఓల్డ్ ఏజ్ హెూమ్స్” ఏర్పాటు చేస్తాం.

50. సుదీర్ఘ కాలంగా పెండింగ్ వున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల | స్థలాల సమస్యను పరిష్కరిస్తాం..

51. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు 5 లక్షల నగదు ఇస్తాం..

52. రాష్ట్రంలో వున్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్స్కు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇస్తాం.

53. ఇకపై తెల్ల రేషన్ కార్డులపై ఇకనుండి సన్న బియ్యం సరఫరా చేస్తాం.

54.గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం.

55. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.

56. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇకనుండి రూ. 6000 లకు పెంచుతాం.

57. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం..

58. హెూమ్ గార్డుల వేతన సవరణలతో పాటూ వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం.

59. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకువచ్చి, చిన్న మరియు మధ్య తరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు అందచేస్తాం.

60. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18000 లకు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి ఉద్యోగ భద్రతను కల్పిస్తాం.

61. 50 సం. దాటిన జానపద కళాకారులకు నెలకు రూ. 3000 లు పెన్షన్ చెల్లిస్తాం.

62. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గా గుర్తించి పూర్తిస్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకువస్తాం.

63. ఎల్బీ నగర్ – ఆరాంఘర్ మెహదీపట్నం – బీహెచ్ ఇఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను నిర్మిస్తాం..

64. హైదరాబాద్ నగరాన్ని ముంపు రహిత నగరంగా తీర్చిదిద్ది నాలాల ఆధునీకరణ చేపడతాం.

65.రాష్ట్ర పురపాలక సంఘాలు, కార్పొరేషన్లు మరియు గ్రామ పంచాయితీలలో ఆస్తి పన్ను, ఇంటిపన్ను బకాయిలపై వున్న పెనాల్టీని రద్దు చేస్తాం.

66. నగర పాలక మరియు మున్సిపాలిటీ కేంద్రాలలో అన్నీ ఆధునిక సౌకర్యాలతో బస్తీ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తాం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 telangana polls
  • congress
  • T-Congress Manifesto 2023

Related News

CM Revanth Reddy

Revanth Reddy : నేను ఎవరి వెనుకా లేను..మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు : సీఎం రేవంత్‌రెడ్డి

కవిత చెబుతున్నట్టు నేను ఆమె వెనుక ఉన్నానంటారు. ఇంకొందరు హరీశ్ రావు, సంతోష్ వెనుక ఉన్నానంటున్నారు. ఈ రాజకీయ పంచాయితీలు ప్రజలకు అవసరం లేదు. నన్ను మీ కుటుంబ, కుల రాజకీయాల్లోకి లాగొద్దు అని రేవంత్ స్పష్టంగా అన్నారు.

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: రేపు కామారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్‌.. షెడ్యూల్ ఇదే!

  • Kavitha

    Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి కవిత రాజీనామా!

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Ktr Assembly

    KTR : రాహుల్‌గాంధీ కంటే ముందే కులగణన చేయాలని చెప్పింది బీఆర్‌ఎస్సే

Latest News

  • India: హాకీ ఆసియా కప్.. ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌!

  • Lunar Eclipse: చంద్ర‌గ్ర‌హ‌ణం రోజున‌ గర్భిణీలు చేయాల్సినవి, చేయకూడనివి ఇవే!

  • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

Trending News

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd