HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Congress Party Leaders Comments On Free Power Supply

Congress : “ప‌వ‌ర్” పాలిటిక్స్‌పై రంగంలోకి కాంగ్రెస్ హైక‌మాండ్‌.. డ్యామేజ్ కంట్రోల్‌లో అగ్ర‌నేత‌లు

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ గురి పెట్టింది. తాజాగా చోటు చేసుకున్న పవర్ పాలిటిక్స్ వేళ నేరుగా రంగంలోకి దిగింది.

  • Author : Prasad Date : 14-07-2023 - 8:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Congress
Congress

తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ గురి పెట్టింది. తాజాగా చోటు చేసుకున్న పవర్ పాలిటిక్స్ వేళ నేరుగా రంగంలోకి దిగింది. రేవంత్ రెడ్డి కామెంట్స్ తో డ్యామేజీని కంట్రోల్ చేసేందుకు చర్యలు మొదలు పెట్టింది. పార్టీ రాష్ట్ర వ్యవహార ఇంఛార్జ్ పార్టీ విధానం పైన స్పష్టత ఇచ్చారు. విధాన పరమైన నిర్ణయాలు,పార్టీ మేనిఫెస్టో హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. సీడబ్ల్యూసీలో చర్చించి తీసుకొనే నిర్ణయాలు మినహా వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండదని తేల్చేసారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని స్పష్టంగా ప్రకటించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో జరిగిన డామేజ్ పార్టీ ఇమేజ్ కు దెబ్బ కాకుండా ఇతర నేతలను రంగంలోకి దించింది. రేవంత్ స్వయంకృతంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ బలం పెరిగింది.

అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ బీఆర్ఎస్ కు టెన్షన్ పెంచుతోంది. కాంగ్రెస్ ను ఎదుర్కోవటం బీఆర్ఎస్ కు సవాల్ గా మారింది. ఈ సమయంలో రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ అస్త్రంగా మలచుకొనే ప్రయత్నం చేసింది. రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ విధానంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ అలర్ట్ అయింది. రేవంత్ చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసే అవకాశం ఉందని గుర్తించింది. వెంటనే పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ థాక్రే పార్టీ వైఖరిని స్పష్టం చేసారు. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అని ప్రకటించారు. కాంగ్రెస్ విధానంలోనే ఉచిత విద్యుత్ ఉందని.. రైతులకు అన్ని వేళలా అండగా నిలిచేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేసారు. తెలంగాణలోనూ రైతులకు కాంగ్రెస్ ఉచిత విద్యుత్ కొనసాగిస్తుందని..వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడినా పార్టీ వైఖరిలో మార్పు లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యల డ్యామేజ్ కంట్రోల్ చేయటానికి రేవంత్ రెడ్డి జిల్లాకే చెందిన వంశీచంద్ రెడ్డి ను పార్టీ రంగంలోకి దించింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ విధానం ఏంటనేది వంశీచంద్ రెడ్డి వివరించారు. అమెరికా లో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని వంశీచంద్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులకు కాంగ్రెస్ ఎప్పుడూ అండగా ఉంది.. ఉంటుందని చెప్పారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ను ఇవ్వడంతో పాటు, రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తామ‌ని తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎంపిక పై కాంగ్రెస్ విధానం అందరికీ తెలిసిందేని రేవంత్ చేసిన సీతక్క సీఎం వ్యాఖ్యల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ చర్చించి ఎవరికీ నాయకత్వం ఇవ్వాలో నిర్ణయిస్తారని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Free Power
  • PCC Chief revanth reddy
  • telngana
  • tpcc
  • trs

Related News

Jangaon Thorrur Congress

లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Congress  తెలంగాణ మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేటు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మెుత్తం 11 మున్సిపాలిటీల్లో నేటిక ఎన్నిక వాయిదా పడగా.. వాటిల్లో అధికార కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. జనగామ, తొర్రూరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అదృష్టం వరించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఛైర్మన్ అభ్యర్థులకు సమానంగా ఓట్లు రావటంతో లక్కీ డ్రా ద్వారా ఛైర్మన్లను ఎం

  • Brs Car

    TG Municipal Elections : అప్పుడు క్లీన్ స్వీప్.. ఇప్పుడు జీరో! బిఆర్ఎస్ పరిస్థితి ఇది !!

  • Bigshock

    TG Municipal Elections Results : కవితకు బిగ్ షాక్ ఇచ్చి..కాంగ్రెస్లో చేరిన వడ్డేపల్లి స్వతంత్రులు

  • Brs

    Telangana Municipal Election Results 2026: ఈ మున్సిపాలిటీల్లో ఒక్క వార్డ్ లో కూడా ఖాతా తెరువలేకపోయిన బిఆర్ఎస్

  • Brs Car

    Telangana Municipal Election Results 2026 : కార్పొరేషన్లలో ఆగిపోయిన ‘కారు’

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd