Meenakshi Natarajan : ఇంచార్జ్ మీనాక్షి ని అవమానించిన టీ కాంగ్రెస్ పార్టీ ..?
Meenakshi Natarajan : మంత్రి పొంగులేటి వర్గీయులు మాత్రం ఇది కేవలం ప్రెస్ ప్రకటన డిజైన్‌కు సంబంధించిన అంశమని, ప్రకటనల్లో ఎవరి ఫోటోలు ఉండాలో పబ్లిసిటీ సెల్ చూసుకుంటుందని సమర్థించుకుంటున్నారు
- By Sudheer Published Date - 03:54 PM, Fri - 4 July 25

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిన్నచిన్న విభేదాలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా మల్లిఖార్జున్ ఖర్గే రాష్ట్ర పర్యటన (Mallikarjun Kharge Tour) సందర్భంగా ఇచ్చిన పత్రిక ప్రకటనల్లో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోటో (Meenakshi Natarajan Photo) లేకపోవడం పెద్ద వివాదంగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ఆమెకు చోటు లేకపోవడంపై పార్టీ సీనియర్ల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Nipah virus : కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్.. ఈ జిల్లాలకు అలర్ట్
ఈ విషయంపై మంత్రి పొంగులేటి(Ponguleti Srinivas Reddy)పై కొన్ని వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇటీవల మీనాక్షి నటరాజన్, పొంగులేటికి క్లాస్ తీసుకున్నారని, పార్టీలో ఆయన ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా నడుస్తోంది. మీనాక్షి నటరాజన్‌ను అవమానించేందుకే ప్రకటనల్లో ఆమెను తొలగించారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఖర్గే పర్యటన సమయంలో జరిగిన ఈ పరిణామం ఆమెకు చేదు అనుభవంగా పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. ఒక పార్టీ ఇంచార్జ్‌ను నిర్లక్ష్యం చేయడం దారుణమని పలు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి : వైఎస్ షర్మిల
అయితే మంత్రి పొంగులేటి వర్గీయులు మాత్రం ఇది కేవలం ప్రెస్ ప్రకటన డిజైన్‌కు సంబంధించిన అంశమని, ప్రకటనల్లో ఎవరి ఫోటోలు ఉండాలో పబ్లిసిటీ సెల్ చూసుకుంటుందని సమర్థించుకుంటున్నారు. మీనాక్షి నటరాజన్‌కి ఇలా ప్రచారం చేసుకోవడం నచ్చదన్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఆమె స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఫొటో పెట్టలేదని వారు చెబుతున్నారు. అయినప్పటికీ ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.