Congress Rebels Withdraw Nominations : రెబల్స్ ను బుజ్జగించే పనిలో మాణిక్ రావ్ ఠాక్రే
కాంగ్రెస్ టికెట్ రాకపోవడం 10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. రేపటికల్లా నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాలి
- Author : Sudheer
Date : 14-11-2023 - 3:20 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ పార్టీ లో రెబెల్స్ (Congress Rebels) గా నామినేషన్ వేసిన అభ్యర్థులను బుజ్జగించే పనిలో అధిష్టానం ఉంది. ఈ మేరకు మాణిక్ రావ్ ఠాక్రే (Congress Incharge Manikrao Thakre) రంగంలోకి దిగారు. తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉంది. దీంతో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే.. పది నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ రెబల్స్‌తో మాణిక్ రావ్ ఠాక్రే చర్చిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బరిలో నుంచి తప్పుకోవాలని వారికీ సూచిస్తున్నారు. కాంగ్రెస్ టికెట్ రాకపోవడం 10 నియోజకవర్గాల్లో అసంతృప్తులను రెబెల్ గా నామినేషన్ దాఖలు చేశారు. రేపటికల్లా నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవాలి.. లేదంటే ఎన్నికల బరిలో నిల్చోవాల్సిందే. ఈ క్రమంలో రెబెల్స్ గా నామినేషన్ వేసిన వారిని ఉపసంహరణ చేసుకోవాలని ఠాక్రే కోరుతున్నారు.
కాంగ్రెస్స్ రెబల్ గా నామినేషన్ వేసిన నియోజకవర్గాలు..
సూర్యాపేట – పటేల్ రమేశ్ రెడ్డి
ఆదిలాబాద్ – సంజీవ్ రెడ్డి
బోథ్ – వెన్నెల అశోక్ ,నరేష్ జాదవ్
వరంగల్ వెస్ట్ – జంగా రాఘవరెడ్డి
వైరా – విజయ భాయ్
నర్సాపూర్ – గాలి అనిల్ కుమార్
ఇబ్రహీంపట్నం – దండెం రాంరెడ్డి
సిరిసిల్ల – ఉమేష్ రావు
డోర్నకల్ – నెహ్రూ నాయక్
జుక్కల్ – సౌదాగర్ గంగారం
బాన్సువాడ – కాసుల బాలరాజు
Read Also : Singapuram Indira : తమ పార్టీ అభ్యర్థి గెలిచే వరకు అరగుండు, అరమీసం తోనే ఉంటా – కార్యకర్త శబదం