Palvai Sravanthi : బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి.. ఇవాళ మధ్యాహ్నమే చేరిక ?
Palvai Sravanthi : ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.
- Author : Pasha
Date : 11-11-2023 - 9:39 IST
Published By : Hashtagu Telugu Desk
Palvai Sravanthi : ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి ఇవాళ మధ్యాహ్నం మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. గత మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేశారు. అయితే బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఈసారి కాంగ్రెస్ టికెట్‌ను కేటాయించడంతో ఆమె నిరాశకు గురయ్యారు. వేరే పార్టీల నుంచి చేరేవారికే కాంగ్రెస్‌లో ప్రయారిటీ ఇస్తున్నారనే మనస్తాపంతో .. ఆమె కూడా పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
మునుగోడుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు చలమల కృష్ణారెడ్డి నవంబరు 1నే హస్తం పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ మునుగోడు టికెట్‌ను కూడా ఇచ్చేసింది. చలమల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో మునుగోడు టికెట్‌ను ఆశించి భంగపడ్డారు. ఈనేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి పోటీని మరింత పెంచుతాయని, గెలిచే అవకాశాలను తగ్గిస్తాయని పరిశీలకులు అంటున్నారు. చలమల, స్రవంతి ఎఫెక్ట్‌తో కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీ, బీఆర్ఎస్‌ల వైపు రెండుగా చీలే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫలితంగా బీఆర్ఎస్ విజయావకాశాలు పెరుగుతాయని(Palvai Sravanthi) చెబుతున్నారు.