Uttam Kumar Reddy: కేసీఆర్ పై కాంగ్రెస్ ‘వరి’అటాక్
తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
- By Hashtag U Published Date - 08:18 PM, Wed - 1 December 21

తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
వరిధాన్యం విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ చేస్తోన్న మోసాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు డిసైడ్ అయ్యారు. ఈ విషయాన్నే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో జరిగిన వరిదీక్ష వేదికపై రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.
పార్లమెంట్ లో తెలంగాణ వరి రైతుల విషయాన్ని ప్రస్తావించిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఖరీఫ్ వరిని సేకరించాలని, అదేవిధంగా రబీ కాలంలోని వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసారు.
పార్లమెంట్ లో రైతుల పక్షాన నిరసన వ్యక్తం చేస్తోన్న టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్ దగ్గరికి వెళ్లి
ఖరీఫ్ పంటను కొనుగోలు చేయాల్సిందింగా ఒత్తిడి తేవాలని
ఉత్తమ్ హితవు పలికారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గోనె సంచులు కొనుగోలు చేయలేదని, కనీసం రవాణా కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం ఖరీఫ్ వరిని సేకరించాలని & రబీ కోసం వరిపై ఎటువంటి ఆంక్షలు వద్దని లోక్‌సభలో డిమాండ్ చేసాను. ఖరీఫ్ పంటను కేసీఆర్ కొనుగోలు చేయాలని కోరాలని టీఆర్‌ఎస్ ఎంపీలకు హితవు పలకడం జరిగింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గోనె సంచులు కొనుగోలు చేయలేదు& రవాణా కాంట్రాక్టులు కూడా ఇవ్వలేదు! pic.twitter.com/qLvIgd4HPJ
— Uttam Kumar Reddy (@UttamINC) December 1, 2021