KTR : నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్ పిలుపు ..
తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు శుక్రవారంనాడు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం
- By Sudheer Published Date - 08:43 AM, Fri - 16 August 24

మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ (KTR) మహిళలకు ఉచిత బస్ (Free Bus) ప్రయాణం పట్ల చేసిన వాక్యాలకు గాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మ దగ్ధానికి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. నిన్న గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ..‘‘బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పా? కుట్లు అల్లికలు చేస్తే తప్పా’ అని మా సీతక్క అంటున్నరు.. తప్పని మేమెక్కడ అన్నామక్కా.. ‘తన్నుకుంటున్నారు.. మంచిగలేదు’ అని మామూలుగా అన్నం. మనిషికో బస్సు పెట్టు.. మేమెందుకు అంటం. మనిషికో బస్సు పెడితే కుటుంబం అంతాపోయి మంచిగ కుట్లు అల్లికలు, అవసరమైతే.. బ్రేక్‌డ్యాన్స్‌లు, రికార్డింగ్ డ్యాన్స్‌లు ఏం చేస్తరో చెయ్యండి.. మేమెందుకు వద్దంటం. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు బస్సుల్లో ఈ రకంగా ఎప్పుడైనా ఆడబిడ్డలు కొట్టుకునే పరిస్థితి ఉండేదా? సీట్ల కోసం కొట్టుకొనుడు, సిగలు పట్టుకొనుడు, గుద్దుకొనుడు.. ఎన్నెన్ని చూస్తున్నం’ అని వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులలతో పాటు మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అంతే కాదు కేటీఆర్ చేసిన ఈ వాఖ్యల పట్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలనీ పిలుపునిచ్చింది. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమాన కరంగా మాట్లాడి వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ ఈ రోజు శుక్రవారంనాడు అన్ని మండల, నియోజక వర్గ, జిల్లా కేంద్రాలలో దిష్టి బొమ్మల దగ్ధం, నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ పిలుపు నిచ్చింది. ఈ నిరసన కార్యక్రమాలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని , మహిళ లోకానికి క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేసారు. మరోపక్క తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. సోషల్ మీడియా వేదికగా నా వ్యాఖ్యల వల్ల మహిళలకు మనస్తాపం కలిగితే విచారం వ్యక్తం చేస్తున్నాను. పార్టీ భేటీలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు తప్ప.. అక్కచెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశం నాకు ఎప్పడూ లేదు అని కేటీఆర్ స్పష్టం చేసారు.
నిన్న పార్టీ సమావేశంలో యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వల్ల మా మహిళా సోదరీమణులకు మనస్తాపం కలిగితే, నేను విచారం వ్యక్తం చేస్తున్నాను ..
నా అక్కచెల్లమ్మలను కించపరిచే ఉద్దేశం ఎప్పుడూ లేదు.
— KTR (@KTRBRS) August 16, 2024
Read Also : Gruha Jyoti Scheme : మీకు ఫ్రీ కరెంట్ రావడం లేదా..అయితే అప్లై చేసుకోవచ్చు – భట్టి