University VCs : నూతన వీసీలకు సీఎం రేవంత్ హెచ్చరిక
University VCs : వైస్ ఛాన్సలర్లకు ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేశామన్నారు
- By Sudheer Published Date - 04:13 PM, Sat - 2 November 24

నూతన వైస్ చాన్స్‌లర్‌లు (University VCS) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భాంగా వారికీ పలు సూచనలు తెలియజేసారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని, వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలనీ , అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేసుకోవాలన్నారు సూచించారు. వైస్ ఛాన్సలర్లకు ఎవరి ప్రభావితంతో పోస్ట్ లు ఇవ్వలేదని మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా వైస్ ఛాన్సలర్లను ఎంపిక చేశామన్నారు.
తప్పు జరిగితే ఆశ్చర్యపడేలా కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సో వస్తుందని హెచ్చరించారు. మంచి పని చేయడానికి వైస్ ఛాన్సలర్ల కి స్వేచ్ఛ ఉంటుందని అందుకోసం ప్రభుత్వ సహకారం ఎప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు. యూనివర్సిటీ లను 100 శాతం ప్రక్షాళన చేయాలన్నారు. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లను విద్యార్థులు యేళ్ల తరబడి గుర్తు పెట్టుకునేవాళ్లు.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. యూనివర్సిటీ ల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపైన దృష్టి సారించాలని వీసీలకు సూచించారు. ఈ సమావేశంలో వీసీలతో పాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) పాల్గొన్నారు.
Read Also : CM Revanth Reddy Counter : ప్రధాని మోడీకి సీఎం రేవంత్ కౌంటర్..