Six Guarantees Application Form : ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రం రిలీజ్ చేసిన సీఎం రేవంత్
- By Sudheer Published Date - 02:06 PM, Wed - 27 December 23

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా బుధవారం ఉదయం సచివాలయంలో అభయ హస్తం (Abhaya Hastham) కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీల దరఖాస్తు పత్రాన్ని రిలీజ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఇచ్చిన 6 గ్యారంటీల్లో (Six Guarantees Application Form) రెండు అమల్లోకి తీసుకొచ్చింది. మిగిలిన గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటీకే రెండు హామీలను నెరవేర్చింది. అధికారం చేపట్టిన రెండు రోజుల్లోనే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం , ఆరోగ్య శ్రీ పరిమితి పెంచిన సర్కార్..ఇప్పుడు మిగిలిన హామీలను నెరవేర్చే పనిలో పడింది. రేపటి (గురువారం) నుంచి ఆరు గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణ మొదలుకానుంది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ సచివాలయంలో అభయహస్తం దరఖాస్తులు విడుదల చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ పాల్గొన్నారు. గురువారం నుంచి ప్రజాపాలనలో ఆరు పథకాలకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఆరు పథకాలకు జనవరి 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రజలకు దగ్గరకు ప్రభుత్వమే వస్తుందని , ఇచ్చిన మాటను కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందని సీఎం రేవంత్ స్పష్టంచేశారు.
Read Also : Praja Palana : ప్రస్తుత పెన్షన్ దారులు ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవాలా..?