HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Revanth Reddy Unveils New Telangana Msme Policy

MSME Policy : ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను ఆవిష్కరించిన సీఎం రేవంత్

MSME Policy : పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు

  • Author : Sudheer Date : 18-09-2024 - 2:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Msme Policy 2024
Msme Policy 2024

CM Revanth Reddy Unveils New Telangana MSME Policy : సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(MSME) నూతన పాలసీని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పారిశ్రామికరంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మార్గనిర్దేశంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (Minister Sridharbabu) నేతృత్వంలో ఈ విధానాన్ని పరిశ్రమల శాఖ తీర్చిదిద్దింది. తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు, ప్రయోజనాలకు అనుగుణంగా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని సిఎం ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నామని గతంలో చెప్పడం జరిగింది. చెప్పినట్లే ఈరోజు ఎంఎస్‌ఎంఈ పాలసీ-2024ను తీసుకొచ్చారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు ఈ పాలసీతో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తోంది.

పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా నూతన MSME పాలసీని రూపొందించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ మేరకు పలు రాయితీలను కల్పిస్తున్నామన్నారు. ‘MSME ‘ల్లో ఆధునిక సాంకేతికతకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నాం. టెండర్ దరఖాస్తుకు ఖర్చు లేకుండా చేస్తున్నాం. పాలసీ విషయంలో 120 మంది పారిశ్రామిక ప్రముఖుల సలహాలు తీసుకున్నాం. రాష్ట్ర ఎకానమీని 1 ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పాలసీని ఆవిష్కరించారు. 33 ఏళ్లకు భూమితోపాటు భవనాల లీజు, నియోజకవర్గానికి ఒక మహిళా పారిశ్రామికవాడ సహా పలు అంశాలను కొత్త విధానంలో చోటు కల్పించారు. ఎగుమతులు, కొత్త లైఫ్ సైన్సెస్, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలను కూడా త్వరలో ప్రభుత్వం విడుదల చేయనుంది. ఈ కార్యక్రమంలో రేవంత్‌ రెడ్డితోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.

Read Also : IND vs BAN Playing XI: కీపర్ రేసులో పంత్ వర్సెస్ ధృవ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • MSME
  • MSME Policy 2024
  • Telangana MSME Policy

Related News

Cm Revanth Vs Aravind

CM Revanth : మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు

రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు సమగ్ర జీవిత బీమా మరియు ఆరోగ్య భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని వెల్లడించారు. ప్రధానంగా మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు 'డిజిటల్ హెల్త్ కార్డులు' జారీ చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని గుర్తు చేశారు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • Cm Revanth Good News

    Free Electric Scooters: కాలేజీ అమ్మాయిలకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd