Viral Tweet : సీఎం రేవంత్ ను కట్టిపడేసిన ‘సలార్’ సాంగ్..
- By Sudheer Published Date - 03:30 PM, Fri - 29 December 23

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ (Salaar) మూవీ దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ (Prabhas) , పృథ్వీరాజ్ (Prithviraj ) లు కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదలైంది. ఇక ఈ సినిమాలోని ఓ సాంగ్ (Sooride Godugu Patti Song) తెలంగాణ సీఎం రేవంత్ (CM Revanth) ను కట్టిపడేసింది. తాజాగా ఆయన పోస్ట్ చేసిన ట్వీటే ఆ విషయాన్నీ చెప్పకనే చెప్పింది.
సలార్ లో పృథ్వీరాజ్, ప్రభాస్ మధ్య ఉన్న స్నేహాన్ని తెలియజెప్పేలా “సూరీడే గొడుగు పట్టి” అనే పాట ఉంది. ఈ సాంగ్ సినిమా రిలీజ్ కంటే ముందే విడుదలై విశేష ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తుందంటే.. ఆ పాటలో ఉన్న ఇంటెన్సిటీ.. ఆ లిరిక్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకున్నాయో అర్ధం చేసుకోవాలి. ఆ పాటను పొలికల్ లీడర్లకు అనువయిస్తూ ఎడిట్ చేసి.. వారి వారి అభిమానులు తమ సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఈ ఎడిట్ వీడియో ను సీఎం రేవంత్ తన ట్విట్టర్ (X) లో పోస్ట్ చేసాడు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సభకు రేవంత్ వెళ్లగా..అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. కాగా.. ఆ సభకు వెళ్లిన సమయంలో ఆయనకు దక్కిన గౌరవాన్ని, రాహుల్ గాంధీతో ఉన్న అనుబంధాన్ని తెలియపరిచేలా ఓ వీడియోను రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా.. ఆ వీడియోకు బ్యాగ్రౌండ్‌లో సలార్ సాంగ్ పెట్టటం విశేషం. ఆ పాటలోని కొన్ని లిరిక్స్ కూడా రేవంత్ రెడ్డి రాసుకొచ్చారు. “వేగమొకడు.. త్యాగమొకడు గతము మరువని గమనమే, ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే, ఒకరు గర్జన.. ఒకరు ఉప్పెన వెరసి ప్రళయాలే, సైగ ఒకరు.. సైన్యం ఒకరు కలిసి కదిలితే కదనమే..” అన్న లిరిక్స్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
వేగమొకడు… త్యాగమొకడు
గతము మరువని గమనమే.ఒకరినొకరు నమ్మి నడిచిన బంధమే ఇదిలే
ఒకరు గర్జన… ఒకరు ఉప్పెన
వెరసి ప్రళయాలే.సైగ ఒకరు… సైన్యం ఒకరు
కలిసి కదిలితే కదనమే#HaiTaiyarHum #Congress #Nagpur pic.twitter.com/kJBSShjC8j— Revanth Reddy (@revanth_anumula) December 29, 2023
Read Also : Ambati Rambabu : అంబటి రాంబాబును కచ్చితంగా ఓడిస్తాం అంటున్న సొంత పార్టీ నేతలు