CM Revanth Open Challenge : తెలంగాణ భవన్ కే వస్తా..దమ్ముందా కేటీఆర్
CM Revanth Open Challenge : ధరణి పోర్టల్ అనేది పేదల భూములను హరిస్తోందని అన్నారు. ధరణి టెండర్లు కేటీఆర్ అత్యంత సన్నిహితులకే కేటాయించారని
- Author : Sudheer
Date : 20-12-2024 - 5:52 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉగ్రరూపం దాల్చారు. ప్రతిపక్ష పార్టీలపై విరుచుకపడ్డారు. అమర్యాదగా ప్రవర్తించి సభాపతిపైనే పేపర్లు విసిరారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం వ్యవహార శైలి, ధరణి పోర్టల్, కేసీఆర్, ఫార్ములా-ఈ కార్ రేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలు బయటపెట్టారు.
ఫార్ములా-ఈ కార్ రేసు అంశం(Formula E Race Issue )పై బీఆర్ఎస్ (BRS) నేతలు బీఏసీ సమావేశంలో చర్చకు ఎందుకు అనుమతి కోరలేదని ప్రశ్నించారు. తమ ప్రమాణ స్వీకారం తరువాతే FEO కంపెనీ ప్రతినిధులు తనను కలిశారని, కేటీఆర్(KTR)తో వారి చీకటి ఒప్పందం ఉందని తనకు సమాచారం ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ స్కామ్ మొత్తం బయటపడిందని, దీనిపై దర్యాప్తు కొనసాగించాలని రేవంత్ స్పష్టం చేశారు.
అలాగే ధరణి పోర్టల్(Dharani Portal)పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ధరణి పోర్టల్ అనేది పేదల భూములను హరిస్తోందని అన్నారు. ధరణి టెండర్లు కేటీఆర్ అత్యంత సన్నిహితులకే కేటాయించారని, టెరాసిస్ వంటి క్రిమినల్ చరిత్ర కలిగిన కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారంటూ రేవంత్ ఆరోపణలు చేశారు. అంతేకాకుండా విదేశాలకు భూముల సమాచారం పంపించారని, ఇది రాష్ట్ర ప్రజల గోప్యతను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర భూముల సమాచారం విదేశీ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని పేర్కొన్నారు.
గాదె శ్రీధర్‌రాజు వంటి వ్యక్తుల ద్వారా విదేశాలకు సమాచారం పంపారన్న ఆరోపణలు చేశారు. ఈ సమాచారం ఒక్క క్లిక్‌తోనే నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిపై దర్యాప్తు జరగాలని, ప్రజలకు నిజాలు వెల్లడించాల్సిన అవసరం ఉందని రేవంత్ పేర్కొన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ కనిపెట్టినదేం కాదని, 2010లో ఒడిశా ప్రభుత్వం ఇది అమలులోకి తెచ్చిందని, అందులోని లోపాలను కాగ్ గుర్తించినప్పటికీ తెలంగాణలో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ తీరుపై అసెంబ్లీ వేదికగా తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ భవన్ కు నేను వస్తానని.. కేటీఆర్ దమ్ముంటే తనను అడ్డుకోమని సవాల్ విసిరారు సీఎం రేవంత్.
Read Also : Jaipur : LPG ట్యాంకర్ పేలుడు..ఘటన వివరాలు..