Bhoomi Puja For Osmania Hospital : ఉస్మానియా కొత్త హాస్పటల్ కు భూమి పూజ చేసిన సీఎం రేవంత్
Osmania Hospital : చాలా ఏళ్లుగా పురాతన భవనం కారణంగా ఆస్పత్రి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
- By Sudheer Published Date - 12:32 PM, Fri - 31 January 25

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) కొత్త భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. చాలా ఏళ్లుగా పురాతన భవనం కారణంగా ఆస్పత్రి సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, కొత్త హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గోషామహల్ మైదానంలో జరిగే ఈ భారీ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభమై ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు సిద్ధం కాబోతుంది. ఈ నూతన ఆస్పత్రి భవనం 26.3 ఎకరాల్లో నిర్మితమవుతుండగా, దాదాపు 2,000 పడకల సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. ఆధునిక వైద్య సదుపాయాలతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఎమర్జెన్సీ విభాగం, ప్రత్యేక వైద్య విభాగాలు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఇందులో ఉండనున్నాయి. ప్రజలకు అత్యున్నత స్థాయిలో వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది.
ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ అంశంపై గతంలో చాలా రాజకీయ వివాదాలు చోటుచేసుకున్నాయి. పాత భవనాన్ని కూల్చివేయాలా, లేక పునరుద్ధరించాలా అనే అంశంపై చర్చలు కొనసాగాయి. అయితే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చి, అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇది కేవలం హైదరాబాదు ప్రజలకు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోగులకు కూడా ప్రయోజనం కలిగించనుంది. ప్రభుత్వ ఆస్పత్రుల పునర్నిర్మాణంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్ త్వరగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉస్మానియా ఆస్పత్రి పునర్నిర్మాణంతో పాటు, ఇతర ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడతామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. కొత్త ఆస్పత్రి ప్రజలకు మంచి సేవలందించి, ప్రభుత్వ వైద్యం నాణ్యతను మరింత పెంచేలా ఉండనుంది.
Budget session : భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ పవర్ హౌస్‌గా మారుస్తాం: రాష్ట్రపతి