Telangana Cabinet Meeting: కేసీఆర్ అధ్యక్షతన మధ్యాహ్నం మంత్రివర్గ భేటీ.. చర్చలోకి కీలక అంశాలు
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది.
- By Praveen Aluthuru Published Date - 09:30 AM, Mon - 31 July 23

Telangana Cabinet Meeting: తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గ సమావేశం జరగనుంది. అధికారికంగా మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో భాగంగా కేసీఆర్ అనేక విషయాలపై మంత్రులతో చర్చించనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వచ్చే ఎన్నికల్లో ఇవ్వబోయే పథకాల హామీలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా తెలంగాణాలో రైతులు నష్టపోయారు. సామాన్యులు ఇల్లు కోల్పోయారు. ముంపు గ్రామాలు అనేకం వరదల దాటికి గురయ్యాయి. వీటిపై కూడా సీఎం కేసీఆర్ మంత్రులతో చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మాత్రం పథకాలు అమలు, మరియు రానున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్ళాలి, అమలైన పథకాలు, రానున్న ఎన్నికలకు ప్రజలకు హామీ ఇవ్వాల్సిన పథకాలపై సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. ఈ క్రమంలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, నిరుద్యగభృతి, దళితబంధు, బీసీలు, మైనార్టీలకు లక్ష ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు, ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు, పంట రుణాల మాఫీ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
Also Read: Hyderabad: మార్నింగ్ వాకర్స్ ని ఢీకొట్టిన స్పోర్ట్స్ బైక్: 2 మృతి