HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Speech At Munugode Bypoll

CM KCR: 100 కోట్ల ఆశ చూపినా.. గడ్డిపోచలా విసిరేశారు!

మునుగోడులో అవసరం లేని ఉపఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు.

  • Author : Balu J Date : 30-10-2022 - 7:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cropped (4)
Cropped (4)

మునుగోడులో అవసరం లేని ఉపఎన్నిక వచ్చిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ఇల్లు కాలిపోతుందన్నారు. చండూరులో నిర్వహించిన తెరాస బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో ఏం జరుగుతుందో ప్రజలు బాగా ఆలోచించాలి. కొందరు దిల్లీ బ్రోకర్లు మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని చూశారు. మేం అమ్ముడుపోయే వాళ్లం కాదని మన ఎమ్మెల్యేలు నిరూపించారు. నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేశారు. ₹100 కోట్ల చొప్పున ఆశ చూపినా.. గడ్డిపోచలా విసిరేశారు’’ అని కేసీఆర్‌ అన్నారు.

కేసీఆర్ స్పీచ్ హైలైట్స్

◻️ ఉప ఎన్నిక ఫలితం కూడా నాకు ముందే తెలుసు

◻️ న్యాయం ధర్మం అంతా మునుగోడు ప్రజలకు తెలుసు

◻️ నాలుగు ముఖ్యమైన విషయాలు చెబుదాం అని మీ ముందుకు వచ్చాను

◻️ ఉప ఎన్నికలు అనేవి పలు రకాల పరిస్థితుల వల్ల వస్తుంటాయి… రకరకాల పార్టీలు, రకరకాల వ్యక్తులు పలు రకాలుగా ప్రయత్నాలు                  చేస్తుంటారు… కానీ జనం అనే వాళ్ళు మారకూడదు

◻️ ఓటు అనేది మన తలరాతను మార్చే గొప్ప ఆయుధం…

◻️ దేశ తలరాతను మార్చు గొప్ప ఆయుధం

◻️ ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలి…

◻️ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు వచ్చారు

◻️ ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని 100 కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారు, వాళ్లని ఎడమకాలు చెప్పుతో కొట్టారు ఈ నలుగురు తెలంగాణ బిడ్డలు

ఇటువంటి దమ్మున్న నలుగురు రాజకీయాల్లో కావాల్సింది

◻️ ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుకొని ప్రభుత్వాన్ని కొలుస్తున్నారు

◻️ దేశంలో మోడీని అడుగుతున్న… మోడీకి ప్రధాని మంత్రి కంటే ఇంకా ఏం పదవి కావాలి..?

◻️ ఆర్ఎస్ఎస్ కు సంబంధాలు ఉన్నవాళ్లు ఢిల్లీ నుంచి వచ్చి నేడు చంచల్గూడా జైల్లో ఉన్నారు

◻️ఈ కుట్ర వెనక ఉన్న వాళ్ళు ఒక్కరూ కూడా వదిలిపెట్టను..పదవులు ఉండటానికి అర్హులు కాదు..

◻️ గాడిదలకు గడ్డి వేసి, ఆవులకు పాలు పితికితే పాలు రావు… అలానే ఓటర్లు కూడా ఆలోచన చేసి ఓటు వేయాలి

◻️ చేనేత రంగంపై జీఎస్టీ 5% విధించిన దుర్మార్గుడు మోడీ

◻️ తెలంగాణలో తప్ప దేశంలో ఏ రాష్ట్రం కూడా 24 గంటల కరెంటు ఇవ్వడం లేదు

◻️ జీఎస్టీ విధించి చేనేత రంగాన్ని నడ్డి విరుస్తున్నారు.,..

◻️ సంస్కరణ ముసుగులో మీటర్లు పెడతారంట.. ఇళ్లల్లో మేటర్ లో కూడా 30,000 కట్టి మీటర్లు కొత్తవి బిగించాలి

◻️ నా బంధువులు నా బలం తెలంగాణ ప్రజలే

◻️ 20 – 30 మంది ఎమ్మెల్యేలను కొన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి చూస్తుంది…

◻️ బిజెపికి డిపాజిట్లు వస్తే, కేసీఆర్ ను పక్కకు జరుపుతారు …..

◻️ చూడు చూడు నల్లగొండ- గుండెల పై ఫ్లోరైడ్ బండ అనే పాట నేనే రాశా

◻️ హంసలాగా పాలను నీళ్ళని వేరు చేసే శక్తి ప్రజలకు రావాలి

◻️ దేశ రాజకీయాలకు మునుగోడు కంకణం కట్టాలి…శ్రీకారం చుట్టాలి

◻️ ఎనిమిదేళ్ల కిందట తెలంగాణ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది… తెలంగాణ పచ్చబడితే ఓర్వలేక పోతున్నారు

◻️ నేను మహా మొండి వాడిని

◻️ మునుగోడు లో తెరాస గెలిస్తే రోడ్లు,హాస్పటల్, కాలేజీలు 15 రోజుల్లో కట్టిస్తా

◻️ మతోన్మాద బిజెపికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలి

◻️ రూపాయి పతనానికి బాధ్యులు బీజేపీ

◻️ ఎక్కడ దాకా అయినా కొట్లాడి మునుగోడుకి మంచినీటి సరఫరా చేయిస్తా

◻️ రేపటి బిఆర్ఎస్ విజయానికి పునాది మునుగోడే కావాలి

◻️ మోదీ విష గురువా..? విశ్వ గురువా..?

◻️కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడటం లేదు…

◻️ నిన్న మొన్న టీవీలో చూసింది మీరు చాలా చిన్నది..- రాబోయే రోజుల్లో ఢిల్లీ పీఠం కదల పోతుంది

◻️ మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా గత 20 ఏళ్లలో ఏ రోజు నేను సభ జరుపలేదు,ఏం తప్పు చేశాడని జగదీష్ రెడ్డి నిషేధించారు..?

◻️ వీటి అన్నిటికీ జవాబు రేపు మూడో తారీకు చెప్పబోతున్నాం

తలమాసినోడు తల బట్టలతో ప్రమాణం చేయమంటే చేయాలా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • Munugode
  • munugode by elections
  • Nalgonda
  • politics
  • telangana

Related News

SBI Life opens three new branches in Telangana

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష్ట్రంలో తన సేవల విస్తృతిని పెంచింది.

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

  • T-SAT

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్‌!

  • Maoists Khali

    మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Latest News

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd