HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Cm Kcr Said If Telangana Gets Better India Should Get Better Too

CM KCR : తెలంగాణ బాగుపడినట్టే.. దేశం కూడా బాగుపడాలి!

తాను ఉన్నంతవరకు రైతుబంధు, రైతు భీమా ఆగదని కేసీఆర్ స్పష్టం చేశారు.

  • Author : Balu J Date : 07-12-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM kcr and telangana
CM KCR Telangana

తాను బతికున్నంత కాలం రైతు బంధు, రైతు బీమా ఆగబోదని తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి, టీఆరెస్ అధ్యక్షులు కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. రాబోయే పది రోజుల్లో రైతుబంధు సహాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ రోజు జగిత్యాల పర్యటన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ధర్మపురి నర్సింహ స్వామి దయ వల్ల తెలంగాణ సాధించుకున్నామని, అక్కడ గోదావరి పుష్క‌రాలు నిర్వహించుకున్నామని కేసీఆర్ తెలిపారు. గోదావరి ముందుగా తెలంగాణ (Telangana) లోనే ప్రవహించినా తెలంగాణలో గోదావరి పుష్కరాలు ఎందుకు జరపరని తాను సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలతో పోరాటం చేశానన్నారు కేసీఆర్. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి వంద కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ (CM KCR) ఈ సందర్భంగా ప్రకటించారు.

స్థానిక ఎమ్మెల్యే, స్థానిక ప్రజల కోరిక మేరకు జగిత్యాల జిల్లాలోని బండలింగాపూర్ ను మండలంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు కేసీఆర్(CM KCR). ఈ జిల్లాలో వరద కాలువ కష్టాలు తనకు తెలుసునని , వరద కాలువపై దాదాపు 16 వేల మోటార్లున్నాయని వాటికి ఒక్క పైసా కూడా లేకుండా ఫ్రీగా 24 గంటలు విద్యుత్తు ఇస్తున్నామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఆ మోటార్లకు మీటర్లు పెట్టాలంటున్నారు పెడదామా అని ప్రజలను ప్రశ్నించారు. మన చుట్టు అనేక మంది అనేక మాటలు చెప్పి మనను ఆగం చేస్తారు. వారి మాటలు విన్నామంటే మన జీవితాలు ఆగమయిపోతాయి. మనం జాగ్రత్తగా ఉండాలే. తెలంగాణ బాగయినట్టే దేశం కూడా బాగ్గావాలె, మనం అధికారంలోకి వచ్చినప్పుడే ప్రధాని మోడీ కూడా అధికారంలోకి వచ్చారు. మనం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి అభివృద్ది చేశాం. ఆగమైన రైతుల బతుకులు బాగుచేయాలని రైతు బంధు, రైతు బీమా, ఫ్రీ కరెంట్, ధాన్యం కొనుగోలు చేస్తున్నాం.

ఇలా ప్రతి ధాన్యం గింజను ఇంటి దగ్గరనే కొనే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. సమైక్య రాష్ట్రంలో బీడీ కార్మికుల గోస‌ ఎవరూ పట్టించుకోలే. 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులున్నప్పటికీ ఏ రాష్ట్రం చేయని విధంగా వారికి వందల కోట్లతో నెలకు 2వేల 16 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం, రేషన్ కార్డులు, పిల్లలకు ఫ్రీ చదువులు, ఆరోగ్య శ్రీ సేవలు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ లాంటివెన్నో ఇస్తున్నాం. ప్రతి వర్గాన్ని అభివృద్ది చేశాం. తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో, అభివృద్దిలో తెలంగాణ నెంబర్ 1. మరి మోడీ ఏం చేశారు ? ఏదైనా రంగంలో అభివృద్ది చేశాడా? మేకిన్ ఇండియా అని నినాదం ఇచ్చిన మోడీ అటువైపు భారత్ ను నడిపించాడా ? పిల్లల బాణా సంచా, పతంగులు, దీపాలు, చివరకు జాతీయ జెండా కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇదేనా మేకిన్ ఇండియా? ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇవ్వకూడదట. కానీ 14 లక్షల కోట్లు పెట్టుబడి దారుల అప్పులు మాఫీ జేశారు.” అని మోడీని విమర్శించారు కేసీఆర్ (CM KCR).


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • raithu bandhu
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd