CM KCR- Revanth Reddy : ఈరోజు పాలకుర్తిలో కేసీఆర్ ..స్టేషన్ ఘనపూర్‌లో రేవంత్ పర్యటన
ముఖ్యంగా కాంగ్రెస్ - బిఆర్ఎస్ పార్టీ లు ఎక్కడ తగ్గడం లేదు..ఏ వేదికను వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు
- Author : Sudheer
Date : 14-11-2023 - 10:31 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) తమ ప్రచారాన్ని మరింత జోష్ పెంచుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ (Congress) – బిఆర్ఎస్ పార్టీ (BRS) లు ఎక్కడ తగ్గడం లేదు..ఏ వేదికను వదిలిపెట్టకుండా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ (CM KCR) తన వయసును సైతం ఏ మాత్రం లెక్క చేయకుండా వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ బిజీ గా మారారు. గతంలో ఏ రేంజ్ లో అయన కష్టపడలేదనే చెప్పాలి.
గత కొద్దీ రోజులుగా ప్రజా ఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha) లతో పర్యటిస్తూ వస్తున్నారు. మొత్తంగా 16 రోజుల పాటు కేసీఆర్ రెండో విడత ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ 16 రోజులలో 54 నియోజకవర్గాలలో గులాబీ బాస్ ప్రచారం నిర్వహించేందుకు రెడీ అయ్యారు. నిన్న అశ్వరావుపేట, పినపాక, భద్రాచలంతో పాటు నర్సంపేటలో ప్రజా ఆశీర్వాద సభలలో ఆయన పాల్గొన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ అభివృద్ధి…సంక్షేమ పధకాలు , 24 గంటల కరెంట్ ఇలా అన్ని ప్రజలకు వివరిస్తూ..మరోసారి బిఆర్ఎస్ కు అధికారం ఇవ్వాలని కోరుతూ వస్తున్నాడు. ఇదే క్రమంలో కాంగ్రెస్ , బిజెపి లపై విమర్శలు చేస్తూ వస్తున్నారు.
నేడు పాలకుర్తి, నాగార్జున సాగర్ (హాలియా), ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభతో తన ప్రచారాన్ని గులాబీ బాస్ కేసీఆర్ ముగిస్తారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం అధికార పార్టీ కి దీటుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ విజయ భేరి యాత్ర పేరుతో బస్సు యాత్ర చేస్తున్నాడు రేవంత్. ఇప్పటికే అనేక నియోజకవర్గాలను కవర్ చేసిన ఈయన..నేడు స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.
నేటి ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అలాగే, మధ్యాహ్నం 1 గంటకు వర్ధన్నపేట బహిరంగ సభతో పాటు సాయంత్రం 4 గంటల నుంచి కామారెడ్డి నియోజకవర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్ లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. కాంగ్రెస్ ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తు..ఈ పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన స్కామ్ లు ,అవినీతి , ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వంటివి ప్రజలకు తెలియజేస్తూ..ఒక్క ఛాన్స్ కాంగ్రెస్ కు ఇచ్చి చూడండి అంటూ రేవంత్ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
Read Also : BSP vs BRS : టీబీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఆయన కుమారుడిపై హత్యాయత్నం కేసు