KCR Plan : మమత తరహాలో కేసీఆర్ ఫైట్
బిహార్ లో మమత ఏ విధంగా మూడో సారి సీఎం అయిందో..అదే ఫార్ములాను కేసీఆర్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది.
- By CS Rao Published Date - 02:45 PM, Sat - 12 February 22

బిహార్ లో మమత ఏ విధంగా మూడో సారి సీఎం అయిందో..అదే ఫార్ములాను కేసీఆర్ అనుసరిస్తున్నట్టు కనిపిస్తోంది. తెర వెనుక పీకే నడిపిస్తున్న రాజకీయ పావులు కేసీఆర్ ఫాలో అవుతున్నాడా? అనే అనుమానం కలుగుతోంది. ఏడేళ్ల మోడీ పాలన పై సహజంగా వ్యతిరేకత ఉంది. తెలంగాణ ఎన్నికలు వచ్చే నాటికి కేంద్రంపై మరింత వ్యతిరేకత వస్తుందని పీకే ఇచ్చిన సర్వే సారాంశం. దాన్ని బేస్ చేసుకొని కేసీఆర్ రాబోయే ఎన్నికలకు పదును పెడుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న వ్యతిరేకతను మోడీని టార్గెట్ చేయటం ద్వారా సమం చేయాలని కేసీఆర్ ఎత్తుగడ. ఇదే ఎత్తుగడ తో మమత ఎన్నికలకు వెళ్ళటం ద్వారా మూడోసారి సీఎం అయింది. అందుకే , కేసీఆర్ జనగామ మీటింగ్ స్పీచ్ మొత్తం ఎన్నికల చుట్టూ తిరిగింది.2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరును విమర్శిస్తూ రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రియాక్ట్ కాలేదు. ఎన్నికలను టార్గెట్ గా చేసుకొని బహిరంగ సభను ఉపయోగించుకున్నారు.
దళిత బంధు పథకం గురించి ప్రస్తావించడమే కాకుండా అణగారిన వర్గాలకు వైన్ షాపులు, మెడికల్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రస్తావించారు.
ఏ నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించాలన్న డిమాండ్‌ను అంగీకరించడాని కి కేంద్రం లేదని, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వే జంక్షన్, మెడికల్ కాలేజీలు ఇవ్వడంలో విఫలమయ్యారని మోదీపై మండిపడ్డారు. బ్యాంకులు, రైతులను వేధించడానికి సెట్ చేయబడ్డాయని దుయ్యబట్టారు.జిల్లాల్లో టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌తో తలపడితే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖను హెచ్చరించారు. ప్రత్యర్థి పార్టీలను హ్యాండిల్ చేయడంలో మాకు మంచి ప్రావీణ్యం ఉందని ఆయన అన్నారు.
జనగాం జిల్లాకు మెడికల్ కాలేజీని ప్రకతించారు. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 2,000 కుటుంబాలకు దళిత బంధు పథకం ప్రయోజనం అందజేస్తామని చెప్పారు. ఇవన్నీ చూస్తుంటే 2023 కంటే ముందే మోడీ పాలన ను టార్గెట్ చేసుకొని మమత తరహాలో వెళ్ళడానికి సిద్దం అయ్యాడని కేసీఆర్ మాటల ఆధారంగా తెలుస్తోంది.