Bathukamma: తెలంగాణ ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్
బతుకమ్మ చివరి రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని,
- By Praveen Aluthuru Published Date - 12:22 PM, Sun - 22 October 23
Bathukamma: బతుకమ్మ చివరి రోజు సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఇది తెలంగాణకు ప్రకృతి పండుగ అని సీఎం అన్నారు. దేవతామూర్తులకు పుష్పార్చన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధన, కృతజ్ఞత తెలియజేసిందన్నారు.
సబ్బండవర్గాలు సమష్టిగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఒక్క తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమని అన్నారు. నేడు తెలంగాణ పచ్చదనం, పాడి పంటలు, పశుసంపద, సహజవనరులతో సమృద్ధిగా నిండిపోయిందని వెల్లడించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా సద్దుల బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జగన్మాత గౌరీదేవిని ప్రార్థించింది.
Also Read: Dalip Tahil: నటుడు దలీప్ తాహిల్‌కు 2 నెలల జైలు శిక్ష