KTR Son Himanshu : గ్రాడ్యుయేషన్ వేడుకల్లో తాత KCR ఆశీర్వాదం తీసుకున్న హిమాన్షు..
తాజాగా హిమాన్షు తన 12వ తరగతి పూర్తిచేశాడు. ఈ నేపథ్యంలో ఓక్రిడ్జ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించింది. ఈ వేడుకలకు సీఎం కేసిఆర్(KCR), కేసీఆర్ భార్య, కేటీఆర్, కేటీఆర్ భార్య, కేటీఆర్ కూతురు.. ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.
- By News Desk Published Date - 10:12 PM, Tue - 18 April 23

KTR తనయుడిగా హిమాన్షు(Himanshu) ఇప్పటికే అందరికి పరిచయం. హిమాన్షు గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్(Oakridge) ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్నాడు. తాజాగా హిమాన్షు తన 12వ తరగతి పూర్తిచేశాడు. ఈ నేపథ్యంలో ఓక్రిడ్జ్ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే నిర్వహించింది. ఇందులో హిమాన్షు తన 12వ తరగతి పట్టాతో పాటు ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకోనుండటంతో ఈ వేడుకలకు సీఎం కేసిఆర్(KCR), కేసీఆర్ భార్య, కేటీఆర్, కేటీఆర్ భార్య, కేటీఆర్ కూతురు.. ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు.
నేడు సాయంత్రం గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ వేడుకలు జరిగాయి. ముందుగా 12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ పట్టాలు అందించారు. అనంతరం పలు ప్రత్యేక విభాగాల్లో ప్రతిభ కనపర్చిన వారికి అవార్డులు అందించారు. కమ్యునిటీ యాక్టివిటీ సర్వీసెస్ విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు హిమాన్షుకు ఎక్సలెన్స్ అవార్డు అందించారు.

స్టేజి మీద ఈ అవార్డు అందుకున్న అనంతరం హిమాన్షు కిందకు వచ్చి తాత కేసీఆర్ పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. దీంతో హిమాన్షు గ్రాడుయేషన్ ఫోటోలు వైరల్ గా మారాయి. BRS కార్యకర్తలు, నాయకులు హిమాన్షుని అభినందిస్తున్నారు.
Also Read : Karnataka 2023: కర్ణాటక ఎన్నికలపై లోక్ పాల్ లేటెస్ట్ సర్వే