HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Clp Leader Bhatti Vikramarka Peoples March In Telangana

Telangana Congress : తెలంగాణ‌పై రాహుల్ గాంధీ ఫోక‌స్‌.. భ‌ట్టి పీపుల్స్ మార్చ్‌పై ఆరా

తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు

  • Author : Prasad Date : 29-06-2023 - 10:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi
Rahul Gandhi

తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా స్థానిక నాయ‌క‌త్వానికి మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర కొనసాగిస్తున్న భట్టి ప్రధానంగా పేద ప్రజలతో మమేకం కావటం.. వారి సమస్యల పైన సానుకూలంగా స్పందించటం పార్టీకి కలిసొచ్చే అంశంగా నేతలు రాహుల్ కు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పైన భట్టి ఎక్కువగా దృష్టి పెట్టారని.. వాటి పైన స్పందిస్తున్న తీరుతో ప్రజల నుంచి పార్టీకి మరింత ఆదరణ పెరుగుతోందని రాహుల్ కు నివేదికలు అందాయి. కర్ణాటక తరువాత దక్షిణాదిన తెలంగాణ కాంగ్రెస్ కు కీలకంగా మారింది.

తెలంగాణలో భట్టి విక్రమార్క్ పీపుల్స్ మార్చ్ యాత్ర కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం రావ‌డం.. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయ‌డం లక్ష్యమని భట్టి ప్రకటించారు. రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర కొనసాగిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్‌లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జూలై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. భట్టి పాదయాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగింది. అప్పటి వరకు ఎవరికి వారుగా ఉన్న నేతలను భట్టి పాదయాత్ర ఒకే వేదిక మీదకు తీసుకొచ్చింది.

భట్టి యాత్రలో నేతలంతా పాల్గొని సంఘీభావం ప్రకటించారు. పార్టీ జాతీయ నేతలు హాజరై మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన ఎక్కడిక్కడ స్పందిస్తూ…కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర సాగిస్తున్నారు. భట్టి ప్రజలతో మమేకం అవుతున్న తీరును రాహుల్ అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. జాతీయ స్థాయిలోనూ భట్టి పాదయాత్ర గురించి ఆరా తీస్తున్నారు. భట్టి పాదయాత్ర చేసిన ప్రాంతాల్లో ఆ వెంటనే బీఆర్ఎస్ నేతలు పర్యటించటం.. భట్టికి స్థానికులు ఫిర్యాదు చేసిన అంశాల పరిష్కారినికి చొరవ తీసుకోవటం ద్వారా భట్టి యాత్ర ఆ పార్టీలో ఎంత కలవరపాటుకు గురి చేస్తుందనేది స్పష్టం అవుతోంది. పాదయాత్ర సమయంలోనే పార్టీలో నేతల చేరికల పైన భట్టి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పొంగులేటి వంటి నేతలు భట్టిని కలిసి ముందుకు సాగాలని నిర్ణయించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CLP leader Bhatti Vikramarka
  • peoples march
  • rahul gandhi
  • revanth reddy
  • telangana
  • tpcc

Related News

MIssing Case

Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

ఫిన్లాండ్‌లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి 45 రోజులుగా అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. కుమారుడి ఆచూకీ కోసం తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు చివరకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హయత్‌నగర్‌కు చెందిన గుజ్జ మణిదీప్ రెడ్డి, ఫిన్లాండ్‌లోని లాహ్తిలో ఉన్న LUT యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్నాడు. మే 5న తన కుటుంబ సభ్యులతో చివరిసారిగా మాట్లాడిన తర

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd