Chikoti Praveen: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చీకోటి, 93 మంది అరెస్ట్
- By Balu J Published Date - 01:41 PM, Mon - 1 May 23
క్యాసినో వ్యవహరంలో తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్ (Chikoti Praveen) థాయ్‌లాండ్ పోలీసులకు చిక్కాడు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు (Police) దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ (Arrest) చేయగా.. అందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరిని ప్రవీణ్ అక్కడికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.
నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ (Gaming) చిప్స్‌ను థాయ్‌లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఏప్రిల్ 27-మే 1 వరకు హోటల్లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని.. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి జరిగిందని అక్కడి పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: New Secretariat: కేసీఆర్ ఫస్ట్ రివ్యూ.. కీలక అంశాలపై చర్చ!
Related News
Ranga Reddy: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో షాకింగ్ విషయాలు
Ranga Reddy: పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి సప్లైయ్ అవుతూనే ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు రాజేంద్రనగర్ పోలీసులు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిది లోని తోల్కట్ట గ్రామ శివారులో ఒక షెడ్లో అక్రమంగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న సౌరబ్ కుమార్ యాదవ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని 580 గ్రాముల గంజాయితో 92 గంజాయి చాక్లెట