HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcrs First Review Meeting In New Secretariat Discussion On Key Issues

New Secretariat: కేసీఆర్ ఫస్ట్ రివ్యూ.. కీలక అంశాలపై చర్చ!

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త సెక్రటేరియట్ (Secretariat)  లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

  • Author : Balu J Date : 01-05-2023 - 1:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM KCR congratulated the village leaders who received Gram Panchayat awards
CM KCR congratulated the village leaders who received Gram Panchayat awards

తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) కొత్త సెక్రటేరియట్ (Secretariat)  లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మంత్రులు తమ తమ ఛాంబర్లలోకి అడుగుపెట్టి పలు పైళ్లపై సంతకాలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు వస్తారా? లేక ప్రగతి భవన్ కే పరిమితమవుతారా? అని ప్రతిపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (CM KCR) సోమవారం కొత్త సచివాలయంలో తన మొదటి సమీక్ష సమావేశం నిర్వహించారు.

కీలక విషయాలపై చర్చ

సచివాలయం లో మొదటి రోజు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అమలు తీరు పై, తాగునీటి కోసం చేపట్టిన పనుల పురోగతి పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్ల నుంచి నారాయణపూర్, కొడంగల్, వికారాబాద్ వరకు వెళ్లే తాగునీటి కాల్వలపై కూడా సమీక్షించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చెఫ్, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.

రెగ్యులర్ గా వస్తారా?

గత తొమ్మిదేళ్లలో సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్, కొత్త సచివాలయ ప్రారంభం నేపథ్యంలో ఇప్పుడైనా వస్తారని తాను భావిస్తున్నానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోను హైదరాబాద్ రాజధానిగా ఉందని, అప్పుడు ఎనిమిది కోట్ల మంది ప్రజలకు సరిపడా సచివాలయం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి సరిపడే విధంగా నాడు గొప్పగా సచివాలయం ఉండేదని, కానీ, ఆనాటి నాయకుల ఆనవాళ్లు ఉండకూడదనే కొత్త సచివాలయాన్ని కట్టుకున్నారని కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఆయన హుజురాబాద్ లో మీడియాతో మాట్లాడారు. చరిత్రలో తానే గొప్పవాడిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ కొత్త సచివాలయాన్ని నిర్మించాడని చెప్పారు. సచివాలయాన్ని కట్టడానికి తాను వ్యతిరేకం కాదని, కానీ ఆయన ప్రతిష్ఠ కోసం, ఆయన పేరు కోసం దీనిని కట్టినట్లుగా భావిస్తున్నానని చెప్పారు.

Also Read: Bhola Shankar Look: ట్యాక్సీ డ్రైవర్ గా చిరంజీవి.. వింటేజ్ లుక్స్ అదుర్స్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • hyderabad
  • review meeting
  • Secretariat

Related News

kurchi-thatha-dies-of-heart-attack

Kurchi Thatha: గుండెపోటుతో కుర్చీ తాత మృతి

“ఆ కుర్చీని మడత పెట్టి’ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్‌‌‌గా మారిన కుర్చీ తాత అలియాస్ మహ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్‌ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్‌ చేస్తున్న సమయంలో ఎండ దెబ్బకు ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. పార్క్‌కు వచ్చిన కొంతమంది గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు పాషాను తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించి ఇంటికి తీసుకెళ్లారు.

  • Tvk Vijay Ntr

    Cm Vijay: తమిళనాడు సీఎం విజయ్‌ మార్క్ పాలన ఇదే

  • Union Minister Bandi Sanjay's mother falls critically ill.

    Bandi Sanjay: కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లికి తీవ్ర అస్వస్థత

  • Former Badminton Player Jwala Gutta Donates 60 Liters of Breast Milk

    Gutta Jwala: 60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన మాజీ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల

Latest News

  • US Inflation: అమెరికాను వణికిస్తున్న నిత్యావసర ధరల

  • AP News: ఏపీలో మరో భారీ పెట్టుబడి..

  • Mega 158: మెగాస్టార్​ చిరంజీవి 158వ సినిమా మొదలు

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd