Amit Shah Tour: బీజేపీకి షాక్, మళ్లీ అమిత్ షా పర్యటన రద్దు
భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల టూర్లు వాయిదా పడుతున్నాయి.
- Author : Balu J
Date : 28-07-2023 - 12:00 IST
Published By : Hashtagu Telugu Desk
భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల టూర్లు వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో పర్యటించాలనుకున్న ప్రియాంకగాంధీ పర్యటన వాయిదా పడింది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. షెడ్యూల్ ప్రకారం ఆయన శనివారం హైదరాబాద్‌కు చేరుకుని జేఎ్‌సఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో వివిధ రంగా ల ప్రముఖులతో సమావేశం కావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతోఈ పర్యటన రద్దయినట్లు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీసుభాష్ తెలిపారు.
ఇక తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో జూలై 30న కాంగ్రెస్ భారీ ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ ర్యాలీలో ప్రియాంక పాల్గొననున్నారు. అయితే వర్షాల కారణంగా ఆమె పర్యటన రద్దయినట్టు తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రజల అభీష్టం మేరకే కాంగ్రెస్ చేపట్టబోయే బహిరంగ సభను వాయిదా వేస్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మల్లు రవి తెలిపారు. ఇక బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు కూడా వాయిదా పడిన విషయం తెలిసిందే.
Also Read: Captain Miller: భారీగా యాక్షన్ ఎపిసోడ్స్ తో కెప్టెన్ మిల్లర్, డిఫరెంట్ లుక్ లో ధనుష్