EX CM KCR : కేసీఆర్‌పై భద్రాచలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- Author : Sudheer
Date : 11-12-2023 - 3:54 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) లపై భద్రాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేసిన ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) అనే వ్యక్తి ..వీరిపై పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసారు.
అసలు ఏంజరిగిందంటే..
భద్రాచలం (Bhadrachalam ) ఆలయ సంస్కృతి, సాంప్రదాయాలను మాజీ సీఎం కేసీఆర్ పాటించకుండా భద్రాచలం ప్రజలు, రామ భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని ఫిర్యాదులో ప్రదీప్ కుమార్ పేర్కొన్నాడు. ఆలయానికి రూ.100 ఇస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని.. వరదలు వచ్చిన సమయంలో భద్రాచలం అభివృద్ధికి తక్షణమే కేటాయిస్తానన్న రూ.1000 కోట్ల నిధులు ఇవ్వలేదని, అలాగే దళతులకు, గిరిజనులకు మూడెకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేశారని కేసీఆర్‌పై ఫిర్యాదు చేసాడు. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు సైతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే భద్రాచలం అభివృద్ధిపై హామీలు ఇచ్చి మాట తప్పారని పిర్యాదు లో పేర్కొన్నారు. మరి ఈ పిర్యాదు స్వీకరించిన పోలీసులు ఏంచేస్తారో చూడాలి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ భారీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. కేవలం 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలతో సిపిఐ స్థానం తో కలిసి 9 స్థానాల్లో విజయం సాధించింది. భద్రాచలం లో మాత్రం బిఆర్ఎస్ అభ్యర్థి వెంకటరావు విజయం సాధించారు.
Read Also : Malla Reddy : కేటీఆర్ లేని హైదరాబాద్‌ను ఐటీ ఉద్యోగులు చూడలేకపోతున్నారు – మల్లారెడ్డి